iDreamPost
android-app
ios-app

ప్రభాస్ కల్కి కోసం మహేష్ బాబు.. సంప్రదించిన నాగ్ అశ్విన్.. పాత్ర ఏంటంటే?

  • Published May 07, 2024 | 10:20 PM Updated Updated May 07, 2024 | 10:20 PM

ప్రభాస్ కోసం ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నటిస్తుండగా.. ఇప్పుడు మహేష్ బాబు కూడా తోడు అవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు పాత్ర ఏంటంటే?

ప్రభాస్ కోసం ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నటిస్తుండగా.. ఇప్పుడు మహేష్ బాబు కూడా తోడు అవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు పాత్ర ఏంటంటే?

  • Published May 07, 2024 | 10:20 PMUpdated May 07, 2024 | 10:20 PM
ప్రభాస్ కల్కి కోసం మహేష్ బాబు.. సంప్రదించిన నాగ్ అశ్విన్.. పాత్ర ఏంటంటే?

ప్రభాస్ కల్కి 2898 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ సినిమాతో డైనోసార్ లా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన డార్లింగ్.. కల్కితో మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభాస్ కల్కి కోసం ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా  పదుకునే, దిశా పఠానీ వంటి స్టార్స్ నటిస్తుండగా.. ఇప్పుడు మరో స్టార్ హీరో ఈ చిత్రంలో భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు కూడా ఓ ముఖ్యమైన పాత్ర కోసం పని చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే నాగ్ అశ్విన్ మహేష్ బాబుని సంప్రదించారని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో విష్ణు అవతారం పాత్ర కోసం మహేష్ ని చిత్ర బృందం కాంటాక్ట్ అయినట్లు సమాచారం. ప్రభాస్ ని విష్ణు అవతారంలో పరిచయం చేయడానికి బ్యాక్ గ్రౌండ్ లో వాయి ఇవ్వాల్సిందిగా దర్శకుడు నాగ్ అశ్విన్ అండ్ టీమ్ మహేష్ ని కలిసి అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ల మూవీలకి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ జల్సా, ఎన్టీఆర్ బాద్ షా సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. వారి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ కొద్దీ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ కి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. గతంలో కృష్ణంరాజు.. ప్రభాస్, మహేష్ కలిసి నటిస్తే చూడాలని అనుకున్నారు.

కృష్ణ, కృష్ణంరాజులా మల్టీస్టారర్ మూవీ చేస్తే చూడాలని అన్నారు. అయితే ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో తెలియదు గానీ ఈ వార్త నిజమైతే కనుక కల్కి సినిమాలో మహేష్ వాయిస్ ఓవర్ తో ప్రభాస్ పరిచయం నడుస్తుందన్నమాట. అంతకు ముందు మహేష్ వాయిస్ ఇచ్చిన జల్సా, బాద్ షా సినిమాలు కూడా మహేష్ వాయిస్ తోనే ప్రారంభమయ్యాయి. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఇప్పుడు ప్రభాస్ కల్కి కోసం వాయిస్ ఓవర్ ఇస్తే నిజంగా ఫ్యాన్స్ కి పూనకాలే. మరి మహేష్ బాబు.. ప్రభాస్ కల్కి సినిమా కోసం వాయిస్ ఇస్తారా? లేదా? ఇస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.