Somesekhar
కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 మూవీకి ఊహించని షాక్ తగిలింది. విడుదలకు ఇంకా రెండు రోజులే ఉండగా.. ఈ మూవీ రిలీజ్ ను ఆపాలంటూ ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. మేకర్స్ కు కోర్ట్ నోటీసులు కూడా జారీ చేసింది. దాంతో అనుకున్న టైమ్ కు భారతీయుడు 2 థియేటర్లలోకి వస్తాడా? రాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 మూవీకి ఊహించని షాక్ తగిలింది. విడుదలకు ఇంకా రెండు రోజులే ఉండగా.. ఈ మూవీ రిలీజ్ ను ఆపాలంటూ ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. మేకర్స్ కు కోర్ట్ నోటీసులు కూడా జారీ చేసింది. దాంతో అనుకున్న టైమ్ కు భారతీయుడు 2 థియేటర్లలోకి వస్తాడా? రాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
భారతీయుడు 2.. అన్ని బాలారిస్టాలు దాటుకుని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు సిద్ధమైంది. జూలై 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. విడుదలకు ఇంకా రెండు రోజులే సమయం ఉంది. ఈ సమయంలో భారతీయుడు 2కి రిలీజ్ కష్టాలు ఎదురైయ్యాయి. సినిమా రిలీజ్ ను ఆపాలని కోర్టుకు ఎక్కాడు ఓ వ్యక్తి. దాంతో జూలై 11న వివరణ ఇవ్వాలని మూవీ టీమ్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. దాంతో అనుకున్న టైమ్ కు ఈ చిత్రం రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఇంతకీ కోర్టుకు ఎక్కింది ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..
విశ్వనటుడు కమల్ హాసన్-డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన చిత్రం ‘భారతీయుడు’. అప్పట్లో ఈ మూవీ ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో మనందరికి తెలిసిందే. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ను తీసుకొస్తున్నారు మేకర్స్. ఎన్నో కష్టాలను ఎదుర్కొని షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. జూలై 12న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతా బాగానే ఉందన్న సమయంలో భారతీయుడు 2కి ఊహించని చిక్కులు ఏర్పడ్డాయి. విడుదలకు రెండే రోజులు సమయం ఉండగా.. ఈ టైమ్ లో సినిమా రిలీజ్ ను ఆపాలంటూ కోర్టుకు ఎక్కాడు ఓ వ్యక్తి. కోర్టు సైతం జూలై 11లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. అసలు విషయం ఏంటంటే?
రాజేంద్రన్ అనే వ్యక్తి రచించిన ‘మర్మకళ’ ఆధారంగా భారతీయుడు 1లో కొన్ని సీన్లను చిత్రీకరించిన విషయం తెలిసిందే. అయితే అది బ్రిటీష్ కాలం నాటి కథ. కానీ భారతీయుడు 2 స్టోరీ పూర్తిగా డిఫరెంట్ కావడంతో.. ఇప్పుడు ఆ మర్మకళను చూపిస్తే.. తప్పుడు సంకేతాలు వెళ్తాయి అన్నది రాజేంద్రన్ వాదన. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ దృష్టికి తీసుకువెళ్లినా.. ప్రయోజనం లేకపోవడంతో.. తాను కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని రాజేంద్రన్ తెలిపాడు. కాగా.. రాజేంద్రన్ పిటీషన్ ను స్వీకరించిన మధురై కోర్టు కమల్ హాసన్ తో పాటుగా నిర్మాణ సంస్థకు, డైరెక్టర్ శంకర్ కు నోటీసులను జారీ చేసింది. జూలై 11లోగా వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. జూలై 12నే మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. అంతకు ముందు రోజే కోర్టు వివరణ ఇవ్వాలనడంతో.. మేకర్స్ సంధిగ్ధంలో పడ్డారు. వారు ఏం వివరణ ఇస్తారు? అనుకున్న టైమ్ కు భారతీయుడు 2 వస్తాడా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.