iDreamPost
android-app
ios-app

Amitabh Bachchan: వారితో కలిసి ‘కల్కి’ చూడాలి.. మనసులో మాట బయటపెట్టిన అమితాబ్!

  • Published Jul 10, 2024 | 10:46 AM Updated Updated Jul 10, 2024 | 10:46 AM

కల్కి భారీ విజయం సాధించడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టాడు అమితాబ్. ఆ వివరాల్లోకి వెళితే..

కల్కి భారీ విజయం సాధించడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టాడు అమితాబ్. ఆ వివరాల్లోకి వెళితే..

Amitabh Bachchan: వారితో కలిసి ‘కల్కి’ చూడాలి.. మనసులో మాట బయటపెట్టిన అమితాబ్!

‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తున్న మూవీ. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇండియాలోనే కాకుండా.. ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపుతోంది. టాలీవుడు రికార్డులను తిరగరాస్తూ కల్కి భారీ విజయం సాధించడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు అమితాబ్. వారితో కలిసి కల్కి సినిమా చూడాలనుందని చెప్పుకొచ్చాడు.

కల్కి మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో.. అమితాబ్ ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సందర్భంగా బిగ్ బి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అమితాబ్ మాట్లాడుతూ..”కల్కిలో అశ్వత్థామ పాత్ర పోషించినందుకు వస్తున్న ప్రశంసలు నా నటనకు అనుకోవడం లేదు. అది ఆ పాత్ర, కాన్సెప్ట్ కు వస్తున్నాయి. ఇక ఈ మూవీలో దీపిక పాత్ర అద్భుతం. ఆమె నిప్పుల్లో నడుచుకుంటూ వచ్చే సన్నివేశం సూపర్బ్. కానీ అందులో ఆమెకు ఏమీ కాకుండా చూపించారు. ఈ సీన్ పై ప్రేక్షకులను అడిగి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందని ప్రేక్షకులను అడిగి తెలుసుకోవాలి. హైదరాబాద్ లో ఉన్న తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని కల్కి మూవీ చూడాలని ఉంది. ఎందుకంటే వాళ్లు సినిమాను ఎంజాయ్ చేసినట్లు, ప్రేమించినట్లు ఎవ్వరూ ప్రేమించరు. కల్కి మూవీ ఐడియా వచ్చినందుకు నాగ్ అశ్విన్ ను ప్రశంసించాలి” అంటూ అమితాబ్ చెప్పుకొచ్చాడు.

కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కల్కి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు రూ. 900 కోట్లకు పైగా (గ్రాస్) వసూళ్లను సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో పాటుగా కల్కి ఓటీటీ గురించి కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆగస్ట్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు ఓటీటీల్లోకి కల్కి రానుంది. హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో రాబోతుండగా.. మిగతా భాషల హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. మరి తెలుగు ప్రేక్షకులతో కల్కి మూవీ చూడాలనుందన్న బిగ్ బి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişBetlike girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel