ఇండస్ట్రీలో సినిమాలన్నీ టాక్ బట్టి ఆదరణ పొందుతున్నాయి. ఇదివరకు హీరోహీరోయిన్ లను చూసి లేదా డైరెక్టర్ ఎవరని తెలుసుకొని వెళ్లేవారు. కానీ.. కాలం మారింది. కాలంతో పాటు ఆడియన్స్ అభిరుచులు కూడా మారిపోయాయి. సినిమాలు రిలీజ్ అయిన రోజే వెళ్లకుండా.. దానికి టాక్ ఎలా వచ్చిందని ఆరాలు తీసి వెళ్తున్న సందర్భాలు ఈ మధ్య చూస్తున్నాం. అలాంటిది ఒక భాషలో ఆల్రెడీ విడుదలై.. ఆ తర్వాత మన భాషలోకి వస్తుందంటే.. ప్రేక్షకులు ఊరుకుంటారా! ఆ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఎలా ఆడింది? అనేది మొత్తం తెలుసుకొని థియేటర్స్ కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
తమిళం నుండి తెలుగులోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ప్రతీది తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుంటారు. అవేగాక స్టార్స్ లేని కంటెంట్ ఉన్న సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతూనే ఉంటాయి. రెండు వారాల క్రితం తమిళంలో విడుదలై.. ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమా ‘గాడ్’. తమిళంలో ఇరైవిన్ పేరుతో రిలీజ్ అయ్యింది. స్టార్ కాంబో జయం రవి, నయనతార జంటగా నటించిన ఈ సినిమాని.. డైరెక్టర్ ఐ. అహ్మద్ తెరకెక్కించారు. తని ఒరువన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవి, నయన్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది.
ఇక ఈ గాడ్ మూవీని.. సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. తమిళంలో సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమాకు.. ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ పరంగాను పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు కోలీవుడ్ లో ఈ ఏడాది ప్లాప్ లిస్టులో ఇరైవిన్ చేరిందని అక్కడి సినీ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. ఇప్పుడదే సినిమాని తెలుగులో డబ్ చేసి అక్టోబర్ 13 థియేట్రికల్ రిలీజ్ చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే తెలుగు సెన్సార్ పూర్తి చేసుకున్న గాడ్.. రన్ టైమ్ 2 గంటల 16 నిముషాల నిడివి ఉన్నట్లు సమాచారం. మరి ఆల్రెడీ అక్కడ అలాంటి టాక్ తెచ్చుకున్న సినిమాని.. తప్పని పరిస్థితిలో తెలుగులోకి తెస్తున్నారా? అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. మరి ఇరైవిన్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.