iDreamPost
android-app
ios-app

గోవాలో షూటింగ్ చేయనున్న ధనుష్, నాగార్జున!

  • Published Feb 04, 2024 | 5:14 PM Updated Updated Feb 04, 2024 | 5:24 PM

కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్​డేట్ బయటకు వచ్చింది.

కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్​డేట్ బయటకు వచ్చింది.

  • Published Feb 04, 2024 | 5:14 PMUpdated Feb 04, 2024 | 5:24 PM
గోవాలో షూటింగ్ చేయనున్న ధనుష్, నాగార్జున!

సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్స్ తెలుగు నాట చాలా అరుదు. సున్నితమైన అంశాలతో సినిమాలు తీసేవారి సంఖ్య చాలా తక్కువ. అలాంటి రేర్ డైరెక్టర్స్​లో శేఖర్ కమ్ముల ఒకరు. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘ఫిదా’, ‘లవ్​స్టోరీ’ మూవీస్​తో విజయాలతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారాయన. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ ధనుష్​తో తీస్తున్న ఫిల్మ్​తో బిజీగా ఉన్నారాయన. ‘ధనుష్ 51’ అనే వర్కింగ్ టైటిల్​తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో కింగ్ అక్కినేని నాగార్జున ఒక కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..  ధనుష్, నాగార్జునతో కొత్త షెడ్యూల్​ గోవాలో స్టార్ట్ అవుతుంది.

‘ధనుష్ 51’ మూవీ కొత్త షెడ్యూల్ గోవాలో మొదలుకానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ షెడ్యూల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట. ఈ రోజు దర్శకుడు శేఖర్ కమ్ముల పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. సునీల్ నారంగ్ సమర్పణలో అమిగోస్ క్రియేషన్స్‌ తో కలసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్​గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ తొలిసారిగా శేఖర్ కమ్ముల సినిమాకి సంగీతం అందిస్తుండటం విశేషం.

బిగ్ ఎక్స్​పెక్టేషన్స్ ఉన్న ‘ధనుష్ 51’ ఫిల్మ్​కు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి. శేఖర్ కమ్ముల గత చిత్రాలు ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక, ధనుష్ యాక్ట్ చేసిన రీసెంట్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. ఈ మూవీ తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి విజయం సాధించింది. ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగులో జనవరి 25వ తేదీన ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కాగా, నేషనల్ అవార్డు అందుకున్న ధనుష్ తన 50వ ప్రాజెక్ట్‌ కోసం తిరిగి రచన, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి.. ధనుష్, నాగార్జునతో శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా కోసం మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet giriş