iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ కి వెన్నునొప్పి.. ‘పుష్ప-2’ వాయిదా!

  • Published Dec 02, 2023 | 9:19 PM Updated Updated Dec 02, 2023 | 9:19 PM

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు. గంగోత్రి మూవీతో అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు సాధిస్తూ.. ఐకాన్ స్టార్ గా ఎదిగారు. ఇటీవల జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ 2 సినిమాలో నటిస్తున్నారు.

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు. గంగోత్రి మూవీతో అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు సాధిస్తూ.. ఐకాన్ స్టార్ గా ఎదిగారు. ఇటీవల జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ 2 సినిమాలో నటిస్తున్నారు.

  • Published Dec 02, 2023 | 9:19 PMUpdated Dec 02, 2023 | 9:19 PM
అల్లు అర్జున్ కి వెన్నునొప్పి.. ‘పుష్ప-2’ వాయిదా!

టాలీవుడ్ లో ఇటీవల స్టార్ హీరోలు ఎక్కువగ పాన్ ఇండియా మూవీస్ పై దృష్టి పెడుతున్నారు. సరైన హిట్ తగిలితే.. ఏకంగా గ్లోబల్ స్టార్ అయ్యే అవకాశం కూడా దక్కుతుంది. అందుకు తగ్గట్టుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలు ఇదే స్ట్రాటజీ మెయింటేన్ చేస్తున్నారు. ఇటీవల పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ అవుతున్న సినిమాలకు సీక్వెల్ ప్లానింగ్ చూస్తున్నారు దర్శక, నిర్మాతలు. తెలుగు ఇండస్ట్రీలో లెక్కల మాస్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిత్రం యూనిట్. తాజాగా పుష్ప 2 సినిమాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. వరుస విజయాలతో దూసుకు పోతున్న బన్నీ చాలా కాలం వరకు పాన్ ఇండియా మూవీస్ వైపు దృష్టి పెట్టలేదు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ తో ఘనవిజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ అల్లు అర్జున్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో పాటలు, డైలాగ్స్, డ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రెటీలు, రాజకీయనేతలు, క్రీడాకారులు ప్రతి ఒక్కరూ అనుకరించారు. ఎన్నో రీల్స్, వీడియోలు వచ్చాయి. ఈ చిత్రంతో అల్లు అర్జున తెలుగు ఇండస్ట్రీ గౌరవాన్ని చాటుతూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. పుష్ప మూవీ హిట్ తో పుష్ప – 2 పై రిలీజ్ పై అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే ఈ మూవీకి సంబంధించిన ఏ అప్ డేట్ ఇప్పటి వరకు బయటకు రాలేదు.

పుష్ప – 2 చిత్రంలో రష్మిక, ఫహద్ ఫాజిల్ తో పాటు మరికొంతమంది ప్రముఖ నటీనటులు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ స్టిల్ బయటకు వచ్చింది. ఆ స్టిల్ కాంతార స్టిల్‌ని తలపించేలా కనిపించింది. తర్వాత మూవీకి సంబంధించిన ఒక్క అప్ డేటెడ్ స్టిల్ కూడా బయటకు రాలేదు. ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో పుష్ప 2 మూవీ షూటింగ్ జరుగుతుంది. అలలు అర్జున్ పై ఒక పాట, ఫైటింగ్ సీక్వెన్స్ జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సాంగ్ లో భారీ కాస్ట్యూమ్స్, మెడలో ఎక్కువగా నిమ్మకాయలు వంటివి ధరించడంతో బన్నీకి షూటింగ్ సమయంలో తీవ్రమైన వెన్నునోప్పి రావడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించినట్లు ఫిలిమ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. బన్నీ షూటింగ్ కంటిన్యూ చేద్దామని చెప్పినా.. సుకుమార్ షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి వెన్నునొప్పి తగ్గగానే షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. కాకపోతే షూటింగ్ క్యాన్సిల్ అన్న విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcasinofast girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom