iDreamPost
android-app
ios-app

నాటు నాటు స్టెప్ ట్రై చేసిన అక్షయ్ కుమార్ – టైగర్ ష్రాఫ్

  • Published Feb 28, 2024 | 3:35 PM Updated Updated Feb 28, 2024 | 3:35 PM

రాజమౌళీ, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన మూవీ ఆర్ఆర్ఆర్. ఇందులో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. అయితే ఈ పాటలోని హుక్ స్టెప్ కు ఫిదా అయిపోయారు చాలా మంది. ట్రై చేశారు కూడా.. తాజాగా

రాజమౌళీ, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన మూవీ ఆర్ఆర్ఆర్. ఇందులో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. అయితే ఈ పాటలోని హుక్ స్టెప్ కు ఫిదా అయిపోయారు చాలా మంది. ట్రై చేశారు కూడా.. తాజాగా

  • Published Feb 28, 2024 | 3:35 PMUpdated Feb 28, 2024 | 3:35 PM
నాటు నాటు స్టెప్ ట్రై చేసిన అక్షయ్ కుమార్ – టైగర్ ష్రాఫ్

ఆర్ఆర్ఆర్ సినిమలోని ‘నాటు నాటు’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ వంటి నేటితరం మాస్ హీరోలు ఇద్దరూ ఒకేసారి కలిసి అదిరిపోయే స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులని అలరించారు. కేవలం తెలుగు ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ వరకూ ఈ పాట‌ పాపులారిటీ పాకింది. ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది నాటు నాటు పాట. కాగా నాటు నాటు పాట సోష‌ల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. ముఖ్యంగా ఆ పాటలో హుక్ స్టెప్ ను ఎందరో సోషల్ మీడియా యూజర్ లు తమదైన స్టైల్ లో ఇమిటేట్ చేశారు. తాజాగా అదే స్టెప్ ను బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ – టైగర్ ష్రాఫ్ లు ట్రై చేసారు.

టైగ‌ర్ ష్రాప్- అక్ష‌య్ కుమార్ ఇద్ద‌రూ క‌లిసి ‘బడే మియాన్ చోటే మియాన్’ అనే చిత్రంలో నటించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాకి అనుకున్నంత బజ్ తీసుకు రాలేకపోయాయి. తాజాగా ఈ సినిమా నుండి ‘మస్త్ మలాంగ్ ఝూమ్’ అనే ఓ కొత్త పాటను విడుదల చేశారు. దీనికి సంబంధించిన చిన్న స్టెప్ పాట విడుదలకు ముందే లీక్ చేసారు. ఒక పబ్లిక్ ఈవెంట్ లో అక్షయ్ కుమార్ – టైగర్ ష్రాఫ్ డ్యాన్స్ చేశారు అయితే ఆ స్టెప్పులు ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట స్టెప్ లా క‌నిపించాయి. హీరోలిద్ద‌రూ ఒక‌రి భుజాల‌ పై ఒక‌రు చేతులు వేసుకో వ‌డం..క‌లిపి కాలు క‌ద‌ప‌డం..వెనుక డాన్స‌ర్లు కూడా అదే మూవ్ మెంట్ లో క‌నిపుంచడం ఇవన్నీ చూసిన నెటిజన్లు నాటు నాటు స్టెప్ ని రీక్రియేట్ చేసారని అభిప్రాయపడ్డారు. దీంతో సోష‌ల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది.

నాటు నాటు స్టెప్ ని తిరిగి రిక్రియేట్ చేయడం అంత ఈజీ కాదని తెలుగు సినీ ప్రేక్షకులు అన్నారు. ఈరోజు ఉదయం పూర్తి పాట రిలీజ్ అయ్యాక డిస్కషన్ మరింత ఎక్కువయ్యింది. టైగ‌ర్ ప్రాష్ గొప్ప డాన్స‌ర్ గా పేరు పొందారు. ఒళ్ళు విరిగిపోయేలా స్టెప్పులు వేయటం తనకు కొత్తేమీ కాదు. అయితే అక్ష‌య్ కుమార్ అంత గొప్ప డాన్సర్ కాదు. ‘మస్త్ మలాంగ్ ఝూమ్’ పాట చూసాక టైగర్ వేగానికి అక్షయ్ సరిపోలేదని బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అంటున్నారు. మరి ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా థియేటర్లలో విడుదలయ్యాక.. హిందీ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారేమో చూడాలి.