iDreamPost
android-app
ios-app

5 నెలల తర్వాత ఓటీటీకి వస్తున్న ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Author singhj Published - 04:56 PM, Fri - 22 September 23
  • Author singhj Published - 04:56 PM, Fri - 22 September 23
5 నెలల తర్వాత ఓటీటీకి వస్తున్న ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

కొత్త సినిమా థియేటర్లలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని హీరోల ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తుంటారు. మంచి బజ్ ఉన్న మూవీ బిగ్ స్క్రీన్స్​లోకి వచ్చిందా వెంటనే చూసేస్తారు. అయితే థియేటర్ రిలీజ్​లకు ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు ఓటీటీ రిలీజ్​లకు కూడా అంతే డిమాండ్ నెలకొంది. మూవీస్ ఓటీటీల్లో వస్తే చూద్దామని చాలా మంది ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. అందులోనూ హిట్టయిన ఫిల్మ్స్ కోసం వెయిటింగ్ ఇంకా భారీగా ఉంటుంది. అందుకే సూపర్ హిట్టయిన సినిమాలు కూడా రెండు, మూడు వారాల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.

బ్లాక్ బస్టర్​గా నిలిచిన సినిమాలు కూడా రెండు, మూడు వారాల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తుంటే..డిజాస్టర్​గా నిలిచిన ఒక మూవీ ఓటీటీ రిలీజ్ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఆ చిత్రమే అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’. ఈ సినిమా రిలీజై ఐదు నెలలకు పైనే అయింది. కానీ ఇప్పటిదాకా ఓటీటీ మోక్షం లేదు. ఆ మధ్య ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ అధికారికంగా ఓ డేట్​ను ప్రకటించింది. కానీ ఆ రోజున ‘ఏజెంట్’ డిజిటల్ స్ట్రీమింగ్​కు రాలేదు. దీంతో ఏదైనా సాంకేతిక సమస్య అయి ఉందటుందని.. రెండు, మూడ్రోజుల్లో వస్తుందని అంతా అనుకున్నారు. కానీ నెలలు గడుస్తున్నా ఇంకా ఓటీటీలోకి రాలేదు.

థియేటర్లలో విడుదలై ఐదు నెలలు గడుస్తున్నా ‘ఏజెంట్’ ఓటీటీలోకి రాకపోవడంతో అనేక అనుమానాలు వచ్చాయి. సినిమాను రీ-ఎడిట్ చేస్తున్నారని, కొత్త సీన్స్​ను జత చేస్తున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలని ఆ మధ్య ప్రొడ్యూసర్ అనిల్ సుంకర క్లారిటీ ఇచ్చేశాడు. ఇక అక్కినేని అభిమానులకు సోనీలివ్ అదిరిపోయే అప్​డేట్​ను తీసుకొచ్చింది. ‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్​ డేట్​ను సోనీలివ్ కన్ఫర్మ్ చేసింది. సెప్టెంబర్ 29న ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కాగా, స్పై యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ‘ఏజెంట్​’లో అఖిల్​కు జోడీగా సాక్ష్మీ వైద్య నటించారు. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి: హీరోయిన్​పై 3 ఏళ్ల నిషేధం.. కారణం ఏంటంటే?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ