iDreamPost

యంగ్ హీరోయిన్ పై 3 ఏళ్ల నిషేధం! కారణం ఏంటంటే?

  • Author Soma Sekhar Published - 03:02 PM, Fri - 22 September 23
  • Author Soma Sekhar Published - 03:02 PM, Fri - 22 September 23
యంగ్ హీరోయిన్ పై 3 ఏళ్ల నిషేధం! కారణం ఏంటంటే?

సాధారణంగా క్రికెట్ లో ఫిక్సింగ్ కు పాల్పడితే సదరు ఆటగాళ్లపై నిషేధం విధిస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ సినిమా ఇండస్ట్రీలో నటీ, నటులపై నిషేధం విధించడం చాలా అరుదనే చెప్పాలి. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు జరగలేదనే చెప్పాలి. కానీ తాజాగా ఓ యంగ్ హీరోయిన్ పై 3 ఏళ్ల పాటు నిషేధం విధించిన వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి 3 సంవత్సరాలు నిషేధం విధించేంత తప్పు ఆ హీరోయిన్ ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ యంగ్ హీరోయిన్ పై 3 సంవత్సరాలు సినిమాల్లో నటించకుండా నిషేధం విధించింది మణిపూర్ కు చెందిన కంగ్లేపాక్ కంబా లప్(KKL)అనే సంస్థ. సోమ లైష్రామ్ మణిపూర్ కు చెందిన యంగ్ హీరోయిన్. ఇప్పటి వరకు 150 చిత్రాల్లో నటించి.. మంచి గుర్తింపుతో పాటుగా, ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. అయితే ఇటీవలే సోమ లైష్రామ్ ఢిల్లీలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఇదే ఆమె చేసిన తప్పు. మణిపూర్ లో ఫ్యాషన్ షోలో పాల్గొనడం, క్యాట్ వాక్ చేయడం నేరంగా భావిస్తారు. దీనికి అక్కడ పెద్ద ఎత్తున శిక్ష పడుతుంది. అందుకే ఈ బ్యూటీపై కంగ్లేపాక్ కంబా లప్ సంస్థ ఆగ్రహించింది. ఈ మేరకు ఆమెను సినిమాలకు, సినిమాలకు సంబంధించిన అన్ని ఈవెంట్స్ కు దూరంగా ఉంచాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి మణిపూర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేకేఎల్ సంస్థ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే తన పై నిషేధం విధించాలని అంటున్న వారికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది సోమ లైష్రామ్. అది ఫ్యాషన్ షో కాదని, ఓ కల్చరల్ ప్రొగ్రామ్ మాత్రమే అని చెప్పింది. మై హోమ్ ఇండియా అనే ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ అని చెప్పింది సోమ. ఈ ఈవెంట్ లో పాల్గొన్న సోమ.. మణిపూర్ లో జరుగుతున్న విధ్వంసాల గురించి స్పీచ్ కూడా ఇచ్చింది. మణిపూర్ లో శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంది. కాగా.. నిషేధ విషయంలో సోమకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభిస్తోంది. అయితే ఈ బ్యాన్ పై ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ప్రకటన వచ్చినట్లుగా తెలియడం లేదు. కేకేఎల్ సంస్థ మాత్రమే ఈ విషయాన్ని ప్రకటించింది. మరి ఫ్యాషన్ షోలో పాల్గొన్నందుకు హీరోయిన్ పై నిషేధం విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి