iDreamPost
android-app
ios-app

కాల్పుల ఘటన: మూడేళ్లుగా అతడి భార్యతో మనోజ్‌!

కాల్పుల ఘటన: మూడేళ్లుగా అతడి భార్యతో మనోజ్‌!

శామీర్‌పేటలోని సెలెబ్రిటీ విల్లాలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మనోజ్‌ అనే వ్యక్తి సిద్ధార్థ్‌ దాస్‌పై కాల్పులు జరపటానికి గల కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌ జరగటానికి వివాహేతర సంబంధం కారణంగా తెలుస్తోంది. సిద్ధార్థ్‌ అతడి భార్య గ్రంథి గొడవల కారణంగా 2009నుంచి వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రంథికి మనోజ్‌తో పరిచయం అయింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత కొన్నేళ్లనుంచి మనోజ్‌, గ్రంథి శామీర్‌పేటలోని సెలెబ్రిటీ విల్లాలో కలిసి ఉంటున్నారు. వారితో పాటు గ్రంథి ఇద్దరు పిల్లలు కూడా అక్కడే ఉంటున్నారు. అయితే, మనోజ్‌ తన ఇద్దరు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడంటూ.. వేధిస్తున్నాడంటూ సిద్ధార్థ్‌ శుక్రవారం శామీర్‌పేటలోని సెలెబ్రిటీ రిసార్ట్‌కు వచ్చాడు. అక్కడ మనోజ్‌కు సిద్ధార్థ్‌కు మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. ఆ గొడవకాస్తా చినికిచినికి గాలివానగా మారింది. మనోజ్‌ సిద్ధార్థ్‌పై ఆగ్రహంతో రగిలిపోయాడు.

ఇంట్లో ఉన్న ఎయిర్‌గన్‌తో సిద్ధార్థ్‌పై కాల్పులు జరిపాడు. అయితే, ఆ ఎయిర్‌గన్‌లో పిల్లెట్స్‌ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. ఇక, ఈ సంఘటనపై సిద్ధార్థ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోజ్‌ను, గ్రంథిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారినుంచి సమాచారం రాబడుతున్నారు. తన భర్త సిద్ధార్థ్‌ తమను బెదిరించడానికి రావటంతోటే గొడవ జరిగిందని గ్రంథి పోలీసులకు తెలిపింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.