ఎయిర్‌పోర్టుకి అతి దగ్గరలో తక్కువ ధరకే ప్లాట్.. ఈ రేటుకి సిటీలో మరెక్కడా దొరకదు

ఎయిర్ పోర్టుకి దగ్గర్లో ఉంది. సిటీలో ప్రధాన ఏరియాలు కూడా దగ్గరగానే ఉన్నాయి. జాతీయ రహదారికి దగ్గరలో ఉంది. సిక్స్ లేన్ రోడ్డు వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. తక్కువ రేటుకే స్థలాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక మంచి లాభాలను పొందవచ్చు. మిడిల్ క్లాస్ వారికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు.

ఎయిర్ పోర్టుకి దగ్గర్లో ఉంది. సిటీలో ప్రధాన ఏరియాలు కూడా దగ్గరగానే ఉన్నాయి. జాతీయ రహదారికి దగ్గరలో ఉంది. సిక్స్ లేన్ రోడ్డు వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. తక్కువ రేటుకే స్థలాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక మంచి లాభాలను పొందవచ్చు. మిడిల్ క్లాస్ వారికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు.

ప్రస్తుతం హైదరాబాద్ లో స్థలాలు కొనాలన్నా కొనలేని పరిస్థితి. రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికైనా.. లేదా ఏదైనా స్థలం మీద ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందాలన్నా గానీ ఎక్కడ బాగా తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడ ఆ ఏరియాల్లో ప్రాపర్టీ కొనుగోలు చేయాలని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతారు. తక్కువ రేటుకి స్థలం కొనేసి కొన్నేళ్లు ఆగితే లాభాలు లక్షల్లో, కోట్లలో ఉంటుందని అంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో ఎందుకు పనికొస్తాయ్ అన్న స్థలాలే ఇప్పుడు కోట్లు తెచ్చిపెట్టాయి. చాలా మందిని కోటీశ్వరులను చేశాయి. సినిమా నటుడు బబ్లూ పృథ్వీ కూడా డబ్బులుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఉన్న ప్లేస్ లో స్థలం కొనలేదు. ఇప్పుడు అది కోట్లు పలుకుతుంది. ఇలా మీరు పొరపాటు చేయకూడదు అనుకుంటే గనుక భూమి తక్కువ రేటుకే అందుబాటులో ఉండగా కొనుక్కోవాలి.    

ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది?:

ఏపీలో వైజాగ్ సిటీలో మరో శంషాబాద్ గా అవతరించనున్న ఏరియా భోగాపురం ఎయిర్ పోర్ట్. ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే కనుక ఈ ఏరియాలో డిమాండ్ అనేది పెరిగిపోతుంది. దీని చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో కూడా రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది. అలాంటి వాటిలో తగరపువలస గ్రామం ఒకటి. ఇది విశాఖ జిల్లాలోని చిన్న గ్రామం అయినప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న వైజాగ్ నగర శివారు ప్రాంతం. కోల్కతా-చెన్నై 16వ జాతీయ రహదారి మీద ఉంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ కి కూడా దగ్గరగానే ఉంది. విద్యాసంస్థలు, వాణిజ్యపరమైన ఉనికితో ఇటీవల సంవత్సరాల్లో తగరపువలస ప్రాంతం బాగా డెవలప్ అయ్యింది. మధురవాడ, భోగాపురం, భీమునిపట్నం ఏరియాలకు అద్భుతమైన కనెక్టివిటీ కలిగి ఉంది.

ప్రధాన ఏరియాలకు దగ్గరలో:

వైజాగ్ కి ఈజీగా కనెక్ట్ అయ్యేలా సిక్స్ లేన్ రోడ్ వస్తుండడం బెనిఫిట్ అని చెప్పవచ్చు. ఇళ్ళ కొనుగోలుదారులు, ల్యాండ్ ఇన్వెస్టర్లు వుడా అప్రూవ్ చేసిన ప్లాట్స్ ని, ల్యాండ్ ని కొనుగోలు చేయవచ్చు. అది కూడా అతి తక్కువ ధరలకే. ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, మార్కెట్స్, హాస్పిటల్స్, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు వంటివి వాటికి దగ్గరగా ఉంది. నీటి వనరులు కూడా పుష్కలంగా ఉన్న కారణంగా ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు అనువైన ప్రదేశంగా ఉంది. సిక్స్ లేన్ నేషనల్ హైవేకి అతి దగ్గరగా ఉంది. వైజాగ్ కి 48 కి.మీ. దూరంలో ఉంది. భోగాపురం నుంచి 21 కి.మీ. దూరంలో ఉంది.

ధరలు ఎలా ఉన్నాయంటే?:

మరో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గా అవతరించనున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ నుంచి 13 కి.మీ. దూరంలో ఈ ప్రాంతం ఉంది. అన్ని రకాలుగా కూడా ఈ తగరపువలస ఏరియా పెట్టుబడికి అనుకూలంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు స్ధలం రూ. 1950గా ఉంది. 2019లో చదరపు అడుగు రూ. 1400గా ఉండేది. 2022లో రూ. 2,350 అయ్యింది. ప్రస్తుతానికి అయితే తగ్గింది. ఇక్కడ గజం స్థలం కొనాలంటే యావరేజ్ గా రూ. 17 వేలు పడుతుంది. 200 గజాల స్థలం కొనాలంటే 35 లక్షలు అవుతుంది. 100 గజాల స్థలం కొనాలంటే 18 లక్షలు అవుతుంది. 150 గజాలు కొనాలంటే 26 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఫ్యూచర్ లో మంచి లాభాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.  

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

Show comments