Vinay Kola
Gautam Adani: ప్రస్తుతం అదానీ కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయినా కూడా కోట్లు సంపాదిస్తున్నారు.
Gautam Adani: ప్రస్తుతం అదానీ కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయినా కూడా కోట్లు సంపాదిస్తున్నారు.
Vinay Kola
అమెరికాలో కొనసాగుతున్న అక్రమాస్తుల ఇక్కట్లు ఎదురుకుంటున్న గౌతమ్ అదానీ ఏమాత్రం తగ్గట్లేదు. కష్టాల్లో కూడా వేల కోట్లు సంపాదిస్తున్నాడు. బిలియనీర్ల ప్రపంచంలో కలకలంతో పాటు రికార్డులు కూడా సృష్టిస్తున్నాడు. శుక్రవారం నాడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెరుగుదల మామూలుగా లేదనే చెప్పాలి. ఆయన ఆస్తి పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గట్లేదు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం.. గౌతమ్ అదానీ సంపదలో 8.64 బిలియన్ డాలర్లు పెరిగాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం గౌతమ్ అదానీ నికర విలువ ఏకంగా రూ.73 వేల కోట్లకు పైగా పెరిగింది. గత కొన్ని రోజుల నుంచి ఆయన నికర విలువలో భారీ క్షీణత కనిపించింది. నవంబర్ 21 నుండి నవంబర్ 28 దాకా గౌతమ్ అదానీ నికర విలువలో $ 18.7 బిలియన్ల క్షీణత కనిపించింది. నవంబర్ 28న గౌతమ్ అదానీ నికర విలువ 66.8 బిలియన్ డాలర్లకు తగ్గింది.
అయితే తాజాగా గౌతమ్ అదానీ మొత్తం నికర విలువ $75.5 బిలియన్లకు చేరుకుంది. ఈ పెరుగుదల తర్వాత,గౌతమ్ అదానీ మరోసారి ప్రపంచంలోని టాప్ 20 బిలియనీర్‌లలోకి దూసుకు వచ్చారు. అయితే ఈ సంవత్సరంలో ఆయన సంపద 8.83 బిలియన్ డాలర్లు క్షీణించింది. నవంబర్ 6న గౌతమ్ అదానీ నికర విలువ ఏకంగా 97.2 బిలియన్ డాలర్లు ఉండేది. ఈ సంపదలో ఇప్పటి దాకా 21.7 బిలియన్ డాలర్ల క్షీణత కనిపించింది. జూన్ 3న గౌతమ్ అదానీ మొత్తం నికర విలువ మొత్తం 122 బిలియన్ డాలర్లు ఉండేది. ఇందులో ఇప్పటి దాకా అయితే 46.5 బిలియన్ డాలర్ల క్షీణత కనిపించింది.
ఇక తాజాగా ఆదానీ సంపద మళ్ళీ ఎలా పెరిగిందంటే.. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన 11 కంపెనీల్లో 9 కంపెనీల షేర్లు శుక్రవారం నాడు డెవెలప్ అయ్యాయి. BSE లో అదానీ గ్రీన్ ఎనర్జీ వాటా 21.72 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 15.56 శాతం, అంబుజా సిమెంట్స్ 3.73 శాతం, అదానీ పోర్ట్స్ 1.94 అదానీ, ఏసీసీ 1.59 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 1.03 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.02 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.02 శాతం పెరిగాయి. అయితే, అదానీ పవర్ షేర్లు మాత్రం 1.01 శాతం క్షీణించాయి. ఇక సంఘీ ఇండస్ట్రీస్ షేర్లు అయితే 0.45 శాతం క్షీణించాయి. ఇక BSE సెన్సెక్స్ 759.05 పాయింట్ల లాభంతో 79,802.79 వద్ద ముగియగా, NSE నిఫ్టీ 216.95 పాయింట్ల లాభంతో 24,131 వద్ద ముగిసింది. ఏది ఏమైనా అదానీ కష్టాల్లో కూడా పోయిన సంపదని మళ్ళీ సపాదించుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.