iDreamPost
android-app
ios-app

Warren Buffett: 9300 కోట్లు విరాళం! కలియుగ కర్ణుడు వారెన్ బఫెట్!

  • Published Nov 27, 2024 | 3:24 PM Updated Updated Nov 27, 2024 | 3:24 PM

Warren Buffett: వారెన్ బఫెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోసారి దాన కర్ణుడిగా నిలిచాడు ఈ అపర కుబేరుడు.

Warren Buffett: వారెన్ బఫెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోసారి దాన కర్ణుడిగా నిలిచాడు ఈ అపర కుబేరుడు.

Warren Buffett: 9300 కోట్లు విరాళం! కలియుగ కర్ణుడు వారెన్ బఫెట్!

ప్రపంచ అపర కుబేరుల్లో మన టాటా లాగానే వారెన్ బఫెట్ కూడా దాతృత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుటారు. ఇప్పటికే చాలా సార్లు వందల కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన ఈ కలియుగ దాన కర్ణుడు తాజాగా మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. దాతృత్వ కార్యక్రమాల కోసం వంద కాదు వెయ్యి కాదు ఏకంగా 1.10 బిలియన్ డాలర్లు ( అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.9300 కోట్లు) విరాళంగా ఇచ్చేసిన మహానీయుడు బఫెట్. తన సంస్థ బెర్క్‌షైర్ హాథ్‌ఏవే నుంచి తన వాటాలో ఈ విరాళాన్ని 4 ఫ్యామిలీ ఫౌండేషన్లకు నవంబర్ 25న ఇచ్చారు. థ్యాంక్స్ గివింగ్ సంప్రదాయంలో భాగంగా ఈ డొనేషన్ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేగాక ఆయన చనిపోయాక తన సంపద 147.4 బిలియన్ డాలర్లు ఏ విధంగా పంపిణీ చేయాలో కూడా చెప్పారు.

తన మరణానంతరం తన ముగ్గురు పిల్లలు పదేళ్ల వ్యవధిలో 147.4 బిలియన్ డాలర్ల ఆస్తిని వారసత్వంగా అందుకుంటారని ఆయన గతంలోనే చెప్పారు. ఒక వేళ ఈ మొత్తం సంపదలో తమ వాటాలు అందుకునే లోపు తన పిల్లల్లో ఎవరైనా మరణిస్తే తదుపరి ఆ సంపద ఎవరికి చేరాలో కూడా నిర్ణయించారు. ఈ మేరకు వాటాదారులకు లేఖ కూడా రాశారు. తమ పిల్లలు మరణిస్తే ఎవరికి ఆ వాటాలు చెందాలనేది వాటాదార్లకు తెలుసునని లేఖలో తెలిపారు. బఫెట్.. ఆయన మొదటి భార్య బెర్క్‌షైర్ తన షేర్లను డొనేషన్ గా ఇచ్చారు. ఆ డొనేషన్ ఇవ్వకపోయి ఉంటే వారెన్ బఫెట్ సంపద ఏకంగా 364 బిలియన్ డాలర్లుగా ఉండేది. అంటే ప్రస్తుత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద 314 బిలియన్ డాలర్లతో పోలిస్తే బఫెట్ సంపద చాలా ఎక్కువే అని చెప్పాలి. అంతేగాక బిల్ గేట్స్, మిలిందా గేట్స్‌కు సంబంధించిన గేట్స్ ఫౌండేషన్‌కు కూడా ఏకంగా 55 బిలియన్ డాలర్లని డొనేషన్ గా అందించారు బఫెట్.

ప్రస్తుతం ఆయన పది సంవత్సరాల క్రితం కొన్న ఒమాహా ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. లగ్జరీ కార్లలోనే ఆయన ఆఫీసుకు వెళ్తారు. కానీ, అనవసరమైన ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంటారు. డబ్బుని చాలా బాధ్యతగా ఖర్చు చేస్తారు. ఇక తమ కుటుంబానికి కావాల్సినవి అన్నీ అందుబాటులో ఉన్నాయని, అయితే, డబ్బులు ఉన్నాయి కదా అని ఇతరులు అసూయపడేలా తాము ఆనందాన్ని కోరుకోవడం లేదని చాలా సందర్భాల్లో వారెన్ బఫెట్ చెప్పారు. నిజంగా వారెన్ బఫెట్ చాలా గ్రేట్ కదూ.. ఇలా తన దాతృగుణంతో కలియుగ కర్ణుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు వారెన్ బఫెట్. ఇక తాజాగా ఆయన దానం చేసిన 9300 కోట్ల విరాళం గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.