iDreamPost
android-app
ios-app

PAN 2.0 పాత పాన్ కార్డ్ చెల్లదా? పూర్తి వివరాలు

  • Published Dec 02, 2024 | 4:56 PM Updated Updated Dec 02, 2024 | 4:56 PM

ప్రస్తుతం ఇండియన్స్ కు పాన్ కార్డు ఓ ముఖ్యమైన పత్రంగా మారింది. అయితే ఇప్పుడు ఇండియాలో స్పెషల్ ఫీచర్స్ , అడ్వాన్స్ ఫెసిలిటీస్ తో పాన్ 2.O అనే ఓ కొత్త కార్డు జారీ చేయడానికి కేంద్ర మంత్రి వర్గం అప్రూవ్ చేసింది. ఈ క్రమంలో ప్రజలకు ఈ పాన్ 2.O మీద రకరకాల సందేహాలు , అనుమానాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం ఇండియన్స్ కు పాన్ కార్డు ఓ ముఖ్యమైన పత్రంగా మారింది. అయితే ఇప్పుడు ఇండియాలో స్పెషల్ ఫీచర్స్ , అడ్వాన్స్ ఫెసిలిటీస్ తో పాన్ 2.O అనే ఓ కొత్త కార్డు జారీ చేయడానికి కేంద్ర మంత్రి వర్గం అప్రూవ్ చేసింది. ఈ క్రమంలో ప్రజలకు ఈ పాన్ 2.O మీద రకరకాల సందేహాలు , అనుమానాలు మొదలయ్యాయి.

  • Published Dec 02, 2024 | 4:56 PMUpdated Dec 02, 2024 | 4:56 PM
PAN 2.0 పాత పాన్ కార్డ్ చెల్లదా?  పూర్తి వివరాలు

ప్రస్తుతం ఇండియన్స్ కు పాన్ కార్డు ఓ ముఖ్యమైన పత్రంగా మారింది. అయితే ఇప్పుడు ఇండియాలో స్పెషల్ ఫీచర్స్ , అడ్వాన్స్ ఫెసిలిటీస్ తో పాన్ 2.O అనే ఓ కొత్త కార్డు జారీ చేయడానికి కేంద్ర మంత్రి వర్గం అప్రూవ్ చేసింది. ఈ క్రమంలో ప్రజలకు ఈ పాన్ 2.O మీద రకరకాల సందేహాలు , అనుమానాలు మొదలయ్యాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉపయోగిస్తున్న పాన్ కార్డ్స్ చెల్లవని… ప్రతి ఒక్కరూ కొత్త పాన్ కార్డ్స్ కొనుగోలు చేయాలనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రశ్నలన్నిటికీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. అసలు పాన్ 2.0 అంటే ఏమిటి? దాన్ని ఎలా తీసుకోవాలి ? దాని స్పెషాలిటీ ఏంటి అనే వివరాలు చూసేద్దాం .

అసలు ఎవరికైనా పాన్ కార్డు ఎందుకు అవసరం అనేది చూద్దాం. ఇండియన్ సిటిజెన్స్ కు పాన్ కార్డు ఓ ముఖ్యమైన పత్రం. దానికి కారణం ఇండియన్ సిటిజన్స్ అంతా ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి రావడమే. ఇన్కమ్ టాక్స్ కు పాన్ కార్డు కు సంబంధం ఏంటంటే.. పాన్ కార్డు ద్వారా ఓ వ్యక్తి ఎలాంటి నగదు లావాదేవీలు చేసినా అది పాన్ నెంబర్ లో నమోదు అవుతుంది. ఈ పాన్ రిజిస్ట్రేషన్ ఎలాంటి అక్రమ నగదు లావాదేవీలు జరగకుండా నిరోధిస్తుంది. ఓ వ్యక్తి లిమిట్ కు మించి ఎక్కువ లావాదేవీలు చేసినా లేదా అతనికి ఎక్కువ ఆదాయం వచ్చినా పాన్ కార్డు ద్వారా.. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు తెలిసిపోతుంది. పైగా పాన్ కార్డు ద్వారా ఇన్కమ్ టాక్స్ చెల్లించారో లేదో కూడా తెలుసుకోవచ్చు.

ఇక పాన్ 2.0 విషయానికొస్తే.. ఈ ప్రాజెక్ట్ టెక్నీకల్ గా చాలా అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ అని చెప్పి తీరాలి. అంతే కాకుండా టాక్స్ పెయిర్స్ కు పేమెంట్స్ ఈజీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించింది. దీనికోసం కేంద్రం రూ.1,435 కోట్లు ఖర్చు చేసింది. పైగా ఈ పథకం ద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయట. అయితే పాన్ 2.O వస్తే పాత పాన్ కార్డు చెల్లదా అంటే.. ఆ అనుమానం అసలు అవసరం లేదని చెప్పింది ప్రభుత్వం. కేవలం పాన్ కార్డు యొక్క సాంకేతికత మాత్రమే మార్చింది ప్రభుత్వం. పాన్ నెంబర్ మాత్రం అలానే ఉంటుందంట. సో ప్రజలెవ్వరూ ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో పాన్ 2.0 పథకం కింద ప్రజలకు ఖచ్చితంగా కొత్త పాన్ కార్డ్ ఇవ్వబడుతుంది. దీనికోసం ప్రజలెవ్వరూ ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదట. పూర్తిగా అందరికి ఉచితంగా దీనిని ప్రభుత్వం అందిస్తుంది. ఇది త్వరలోనే ప్రజల వినియోగానికి అందుబాటులోకి రానుందట. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.