iDreamPost
android-app
ios-app

Amazon బ్లాక్ ఫ్రైడే సేల్ స్టార్ట్.. ఆఫర్ల జాతర మామూలుగా లేదు!

  • Published Nov 29, 2024 | 5:59 PM Updated Updated Nov 29, 2024 | 5:59 PM

Amazon: అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ స్టార్ట్ అయింది. ఆఫర్లు మామూలుగా లేవు.

Amazon: అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ స్టార్ట్ అయింది. ఆఫర్లు మామూలుగా లేవు.

Amazon బ్లాక్ ఫ్రైడే సేల్ స్టార్ట్.. ఆఫర్ల జాతర మామూలుగా లేదు!

బ్లాక ఫ్రైడే సేల్‌ అమెరికాలో పాపులర్ సేల్. అక్కడ ప్రతి ఏటా బ్లాక్‌ ఫ్రైడే్‌ పేరుతో సేల్‌ను జరుపుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ సేల్‌ బాగా ట్రెండ్ అవుతుంది. ఇండియాలోనూ ఈ సేల్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే కొన్ని ఈ కామర్స్ సంస్థలు ఈ సేల్ ని జరిపాయి. తాజాగా అతి పెద్ద ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ కూడా భారత్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్‌ను స్టార్ట్ చేసింది. ఈ ఏడాదికి గాను నవంబర్‌ 29వ తేదీ నుంచి అమెజాన్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ పేరుతో ఆఫర్ల జాతర సృష్టిస్తుంది. ఇక ఈ అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఎప్పుడు దాకా ఉంటుంది? ఈ సేల్ లో వేటిపై ఆఫర్లు ఉన్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

డిసెంబర్‌ 2వ తేదీ దాకా ఈ సేల్ కంటిన్యూ అవుతుంది. ఇక ఈ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ నుంచి అన్ని రకాల హోమ్ అప్లియెన్సెస్ పై భారీ డిస్కౌంట్స్‌ ఉంటాయి. ఇక ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ ల్యాండ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి. ఈ బ్యాంక్స్ క్రెడిట్‌ లేదా డెబిట్ కార్డులతో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే ఏకంగా 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక ప్రైమ్‌ మెంబర్స్‌కి అయితే ఈ సేల్ పండగనే చెప్పాలి. ఎందుకంటే వీరికి ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్‌ లభిస్తుంది.ప్రైమ్‌ మెంబర్స్‌ అమోజాన్‌ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే 5 శాతం ఎక్స్ట్రా గా క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు.

అలాగే ఈ సేల్‌లో కొన్ని ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై ఏకంగా 75 శాతం దాకా డిస్కౌంట్‌ ఉంటుంది. అలాగే ఐఫోన్‌ 15 సిరీస్‌ మొదలు, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్‌23 ఫోన్‌లపై కళ్ళు చెదిరే డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23 అల్ట్రా 5జీ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 1,24,999 కాగా ఈ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో కేవలం రూ. 74,990కే సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే దీనిపై ఏకంగా 50% ఆఫర్ ఉంది. అలాగే యాపిల్, ఐక్యూ, వన్‌ప్లస్‌, రియల్ మీ, రెడ్‌మీ, టెక్నో ఫోన్‌లపై ఏకంగా 40 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. అలాగే యాపిల్‌ మ్యాక్‌ బుక్‌ ఎయిర్‌ ల్యాప్‌టాప్‌ ధర రూ.89,900 కాగా.. ఆఫర్‌లో కేవలం రూ.59,990కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ సేల్‌లో వాషింగ్‌ మెషిన్స్‌పై కూడా సూపర్ డిస్కౌంట్స్‌ ఉన్నాయి. కాబట్టి మంచి ఆఫర్లు కావాలనుకునేవారికి ఈ అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis