Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈక్రమంలోనే లోకేశ్ గురించి ఓ కొత్త చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈక్రమంలోనే లోకేశ్ గురించి ఓ కొత్త చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వింతగా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ వారసత్వ రాజకీయాలు ఉన్నాయనే టాక్ కూడా ఉంది. తాజాగా మాజీ మంత్రి నారా లోకేశ్ విషయంలో అదే వారసత్వం కనిపిస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు తర్వాత ఆ పార్టీకి దిక్కు లోకేష్ అని.. అంతటి సమర్థత ఆయనకు ఉందంటూ ఏవేవో కబుర్లు చెప్పారు ఇన్ని రోజులు. అయితే లోకేశ్ రాజకీయంగా ఆశించిన స్థాయిలో లేడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలోని కొందరు నేతలు డిక్లేర్ చేసినా సరే ఇన్ని రోజులు ఆయన్ను బలవంతంగా ప్రజలపై ఇటు పార్టీపై రుద్దాలని ప్రయత్నాలు చేశారనే టాక్ ఉంది. అయితే తాజాగా లోకేశ్ ను టీడీపీ పక్కన పెట్టేస్తుందనే వాదనలు వినిపిస్తున్నారు. గురువారం జనసేన, టీడీపీ ఉమ్మడి సమావేశంలో లోకేశ్ పక్కనే ఉన్నా అచ్చెన్నాయుడు మాట్లాడటం జరిగింది.
చంద్రబాబు నాయుడి తరువాత టీడీపీ పగ్గాలు చేపట్టేది నారా లోకేశ్ అని అందరూ భావించారు. అందుకు తగ్గినట్లే లోకేశ్ కూడా తనను తాను లీడర్ గా అందరు గుర్తించేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. యువగళం పాదయాత్ర అంటూ ఏదో హంగామా చేశారు. కానీ అది కూడా చివరకు అట్టర్ ప్లాప్ అయింది. ముఖ్యంగా చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత లోకేష్ సమర్థతపై అందరికి క్లారిటీ వచ్చంది. పార్టీని సమర్థవంతంగా నడిపించడం ఆయన వల్ల కాదని ఆఖరకు చంద్రబాబు కూడా డిసైడ్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే చంద్రబాబు జైల్లో ఉండగా లోకేశ్ ను పక్కన పెట్టేసి.. ఎప్పుడూ రాజకీయాల్లో కనిపించని నారా భువనేశ్వరిని ప్రజల్లోకి తీసుకొచ్చారు.
తాజాగా మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు బయటకు రావడంతో ఇక ఆయనే చూసుకుంటున్నారు. దీంతో భువనేశ్వరి విశ్రాంతి తీసుకుంటున్నారు. చంద్రబాబు బయటకు వచ్చిన తరువాతైనా లోకేష్ కు ఏదో ఒక పని అప్పజెబుతారని అనుకుంటే అది కూడా లేదు. గురువారం రోజున విజయవాడలో టీడీపీ, జనసేన జేఏసీని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో లోకేష్, అచ్చెన్నాయుడు నాదెండ్ల మనోహర్ తో పాటు మరికొందరు పాల్గొన్నారు. మీటింగ్ అనంతరం టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో మీద మాట్లాడారు. సమావేశానికి సంబంధించిన విషయాలను మీడియాకు వివరించే సమయంలో అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ మాత్రమే మాట్లాడారు. సమావేశంలో పాల్గొన్న లోకేష్ ఎక్కడా మాట్లాడలేదు. ఏదో ఉన్నామా అంటే ఉన్నాం అన్నట్టు పక్కన కూర్చుండిపోయాడు. అంతే తప్ప ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
నిజంగా లోకేశ్ కీలక నేత అనుకుంటే.. ఈ విషయాలను అన్ని ఆయనే స్వయంగా మీడియాకు చెప్పాలి కదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక అన్ని ముందుండి నడిపించాలని, సమావేశంలో కూడా ఆయన చెప్పిందే జరగాలి కదా అని పలువురు అభిప్రాయ పడ్డారు. ఆ విషయం అసలు ఆయనకు చెందినది కాదు అన్నట్టు టీడీపీ పక్కన పెట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇది చంద్రబాబుకు తెలిసే.. జరిగిన సమావేశం. అంటే లోకేష్ దేనికి పనికిరాడని చంద్రబాబే స్వయంగా తేల్చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి.. టీడీపీ లోకేశ్ ను పక్కన పెట్టేస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.