జనసేన కిందే టీడీపీ పనిచేయాలి.. రచ్చలేపుతున్న నాగబాబు వ్యాఖ్యలు!

  • Author singhj Published - 07:56 AM, Mon - 25 September 23
  • Author singhj Published - 07:56 AM, Mon - 25 September 23
జనసేన కిందే టీడీపీ పనిచేయాలి.. రచ్చలేపుతున్న నాగబాబు వ్యాఖ్యలు!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబుతో ములాఖత్ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్​ టీడీపీతో తమ పార్టీ పొత్తు గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలసి జనసేన ముందుకు వెళ్తుందని పవన్ తెలిపారు. ఈ ప్రకటనతో పవన్​ను టార్గెట్ చేస్తూ అధికార వైసీపీ నేతలు కామెంట్స్ చేశారు. పవన్ ముసుగు తొలగిపోయిందని.. ప్యాకేజీ కోసం జనసేనను పవన్ మరోమారు తాకట్టు పెట్టారంటూ వైసీపీ నాయకులు విమర్శలకు దిగారు. అయితే పొత్తు వ్యవహారంపై పవన్ సోదరుడు నాగబాబు తాజాగా స్పందించారు.

టీడీపీతో పొత్తుపై జనసేన నేత, నటుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన కిందే టీడీపీ పనిచేస్తుందంటూ కార్యకర్తలను ఉద్దేశించి నాగబాబు పేర్కొన్నారు. చిత్తూరు పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి జనసేన కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు టీడీపీతో పొత్తు ప్రస్తావన తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు గతంలో తమను టార్చర్ పెట్టారని వాళ్లు నాగబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గతం గురించి మర్చిపోయి ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సర్దిచెప్పే యత్నం చేశారు నాగబాబు.

పార్టీ కార్యకర్తలకు సర్దిచెప్పే క్రమంలో టీడీపీ మన కిందే పనిచేయాలని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నాగబాబు. ‘పొత్తు ఉన్నా సరే.. టీడీపీ నేతలు మన కిందే పనిచేయాలి. తెలుగుదేశంతో కలసి పనిచేసినా జనసేన అజెండానే మీరు ముందుకు తీసుకెళ్లాలి’ అని పార్టీ కార్యకర్తలకు సూచించారు నాగబాబు. పవర్​లోకి వస్తే పవన్ కళ్యాణ్​ సీఎం అవుతారంటూ ఆయన చేసిన కామెంట్స్​ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే.. జైల్లో ఉన్న బాబును కలిసేందుకు వచ్చిన పవన్ టీడీపీతో జనసేన పొత్తు గురించి ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఈ ఇరు పార్టీల క్యాడర్ నుంచి అసంతృప్తి రాగాలు బయటపడుతుండటం గమనార్హం.

ఇదీ చదవండి: రెచ్చిపోతున్న హిజ్రాలు.. ఆ రూట్లో అస్సలు వెళ్లకండి!

Show comments