iDreamPost
android-app
ios-app

రెచ్చిపోతున్న హిజ్రాలు.. ఆ రూట్లో అస్సలు వెళ్లకండి!

రెచ్చిపోతున్న హిజ్రాలు.. ఆ రూట్లో అస్సలు వెళ్లకండి!

ఈ మధ్య కాలంలో కొంతమంది హిజ్రాలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. డబ్బుల వసూలు పేరిట జనాల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దారులు కాస్తూ  వేలకు వేలకు దోచుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో హిజ్రాల దారుణాలు వెలుగులోకి వచ్చాయి. స్పీడు బ్రేకర్ల దాపు దగ్గర కాపు కాస్తూ వాహనదారుల నుంచి భారీగా డబ్బులు దోచుకుంటున్నారు. ఒక్కో వాహనదారుడి దగ్గరినుంచి 2 వేల నుంచి 5 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.  ఆ వివరాల్లోకి వెళితే..

కొంతమంది హిజ్రాలు కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళ్లే దారిలో కాపు కాస్తున్నారు. స్పీడు బ్రేకర్ల దగ్గర వాహనాలను ఆపుతున్నారు. బైకుల నుంచి బస్సుల వరకు అన్ని వాహనాలను ఆపుతున్నారు. వాహనదారుల నుంచి 2 వేల నుంచి 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అంతేకాదు! చీరలు అమ్ముకునే వారి దగ్గరినుంచి చీరలు కూడా లాక్కుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి బైకు మీద వెళుతుండగా హిజ్రాలు అతడ్ని ఆపారు. 2500 ఇచ్చేంత వరకు వదలిపెట్టలేదని అతడే స్వయంగా చెప్పాడు.

గతంలోనూ హిజ్రాలు ఈ విధంగా దారుణాలకు పాల్పడ్డ ఘటనలు చాలా ఉన్నాయి. 2021 జులైలో బత్తలపల్లి మండలం పోట్లమర్రి సమీపంలో కొందరు హిజ్రాలు పెళ్లి వాహనాన్ని ఆపారు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని వాహనంపై రాళ్లతో దాడి చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దుస్తులు విప్పేసి నడిరోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఇలా వరుస వివాదాలతో హిజ్రాలు తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. మరి, అనంతపురంలో వాహనదారులను ఇబ్బంది పెడుతున్న హిజ్రాలపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş