iDreamPost
android-app
ios-app

విషాదం.. ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. 84 ఏళ్ల వయసు కలిగిన యామినీ కృష్ణమూర్తి గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇటీవల పలువురు సెలబ్రిటీలు అనారోగ్య కారణాలతో, ఇతర కారణాలతో కన్నుమూస్తున్నారు. తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. 84 ఏళ్ల వయసు కలిగిన యామినీ కృష్ణమూర్తి గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం మరింత క్షీణించి తుదిశ్వాస విడిచారు. కాగా భరతనాట్యం, కూచిపూడితో గుర్తింపు తెచ్చుకున్నారు యామినీ కృష్ణమూర్తి. యామినీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లె. 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించింది.

భారతీయ నృత్యకారిణిగా ఖ్యాతిని గడించారు యామినీకృష్ణమూర్తి. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చింది. అప్పటి నుంచి దేశ, విదేశాల్లో వేలాదిగా ప్రదర్శనలిచ్చారు. యామినీ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా పని చేశారు. ఆమెకు భారతీయ కళారంగానికి చేసిన సేవకు గుర్తింపుగా కేంద్రం తొలిసారిగా 1968లో పద్మశ్రీతో సత్కరించింది. 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారాలను అందజేసింది. యామినీకృష్ణమూర్తి మృతిపట్ల పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.