RI స్వర్ణలత కేసు: విచారణలో సంచలన విషయాలు వెల్లడి!

RI స్వర్ణలత కేసు: విచారణలో సంచలన విషయాలు వెల్లడి!

విశాఖలో నోట్ల మార్పిడి కేసులో సీటీ ఆర్ఐ సీఐ స్వర్ణలతను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం తాను డబ్బుకు ఆశపడి మాత్రమే ఆ తప్పు చేసినట్లు  పోలీసుల విచారణలో ఒప్పుకుంది. సినిమాలపై ఆసక్తి తన కొంప ముంచిందని కన్నీళ్లు పెట్టుకుదని సమాచారం. నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలిగా స్వర్ణలత రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆమెకు ఒక రోజు పోలీసు కస్టడీ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆమెను కేజీహెచ్ కు తరలించి వైద్య పరీక్షలు చేసి..తిరిగి జైలుకు తరలించారు.

క్రైమ్ డీసీపీ నాగన్నతో పాటు ఏసీపీ, ముగ్గురు ఎస్ఐలు, మహిళ సిబ్బంది ఆధ్వర్యంలో  గురువారం ఉదయం జైలు నుంచి తీసుకొచ్చి ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్ లో విచారించారు.  ఇక విచారణ సమయంలో తొలుత స్వర్ణలత వేరు వేరు కథలు చెప్తూ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని సమాచారం. అయితే  అధికారులు గట్టిగా  ప్రశ్నిచడంతో ఆమె.. అసలు నిజాలను వెల్లడించింది.  నగరంలో పెద్ద ఎత్తున నగదు మార్పిడికి సిద్ధంగా ఉన్నట్లు స్వర్ణలత గ్యాంగ్ తెలిపింది. నేవీ ఉద్యోగులు రూ.90 లక్షలు తెచ్చిన మాట వాస్తవమేనని, కానీ నగదు మార్పిడికి సంబంధించి తన వాహనంలో ఎలాంటి  రూ.2000 నోట్లు తీసుకెళ్లలేదని వెల్లడించినట్లు సమాచారం.

నగరంలో ఓ నేత వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను త్వరగా మార్పిస్తే 10 శాతం కమీషన్ వస్తుందని మరో నాయకుడి ద్వారా తెలుసుకుని ఈ మోసానికి పాల్పడినట్లు ఆమె ఒప్పుకున్నారని సమాచారం. ఏ1 సూరి, కానిస్టేబుల్, తన వాహన డ్రైవర్ ఒత్తిడి చేయడం వల్లనే డబ్బులకు ఆశపడి వెళ్లినట్లు అధికారులు తెలియజేసినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ నిమిత్తం ఆమె డ్యాన్స్ వీడియోలపై కూడా పోలీసులు ప్రశ్నించారు. సీజ్ చేసిన ఫోన్లలో డేటాను చూడొద్దని, వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్నాయని స్వర్ణలత ప్రాధేయపడినట్లు తెలిస్తోంది.  అయినా ఆమె అభ్యర్థనలను అధికారులు పట్టించుకోలేదని సమాచారం. జాలిపడితే విధులను నిర్వహించలేమని ఉన్నతాధికారులు కఠినంగా చెప్పినట్లు తెలుస్తోంది. మరి.. కస్టడీలో ఆర్ఐ స్వర్ణలత వెల్లడించిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మాతృత్వానికి మచ్చతెచ్చిన తల్లి.. కన్నబిడ్డలను రెండో భర్త పరం చేసిన మహిళ!

Show comments