iDreamPost
android-app
ios-app

థియేటర్స్ బంద్ ప్రస్తుతానికి లేనట్లే..

  • Published May 22, 2025 | 12:40 PM Updated Updated May 22, 2025 | 12:40 PM

రోజు రోజుకు ఆదాయ మార్గాలు పడిపోవడం , టికెట్ రేట్స్ పెరగడం ఇలా అనేక కారణాల వలన కొన్ని ఆడిటోరియమ్స్ ఖాళీగా ఎగ్జిబిటర్స్ ఇక తమ వలన కాదని స్పష్టం చేశారు. ఈ విషయం మీద రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది ఎగ్జిబిటర్స్ , కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సమావేశమయ్యారు. తీవ్ర చర్చల అనంతరం జూన్ 1న థియేటర్స్ బంద్ కు పిలుపునిచ్చారు.

  • Published May 22, 2025 | 12:40 PMUpdated May 22, 2025 | 12:40 PM
థియేటర్స్ బంద్ ప్రస్తుతానికి లేనట్లే..

రీసెంట్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ చేస్తారనే టాక్ వినిపించింది. రోజు రోజుకు ఆదాయ మార్గాలు పడిపోవడం , టికెట్ రేట్స్ పెరగడం ఇలా అనేక కారణాల వలన కొన్ని ఆడిటోరియమ్స్ ఖాళీగా ఎగ్జిబిటర్స్ ఇక తమ వలన కాదని స్పష్టం చేశారు. ఈ విషయం మీద రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది ఎగ్జిబిటర్స్ , కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సమావేశమయ్యారు. తీవ్ర చర్చల అనంతరం జూన్ 1న థియేటర్స్ బంద్ కు పిలుపునిచ్చారు. గతంలో ఓసారి ఇలాంటి విషయం మీద కొన్ని థియేటర్స్ మూత పడ్డాయి. సో ఈసారి కూడా ఇలానే జరుగుతుందేమో అని అంతా ఆందోళన చెందారు. ఎందుకంటే సరిగ్గా అదే సమయంలో థియేటర్స్ లో మంచి సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమి జరుగుతుందా అని అంతా సందిగ్ధంలో పడ్డారు.

కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. జూన్ 1న థియేటర్స్ బంద్ ను తాత్కాలికంగా నిలిపివేశారట. ఆ నెలలో హై ప్రొఫైల్ సినిమాలు రిలీజ్ కావడమే రీజన్. ‘హరిహర వీరమల్లు’, ‘కుబేర’, ‘థగ్ లైఫ్’, ‘కన్నప్ప’ లాంటి సినిమాల మీద ప్రొడ్యూసర్స్ చాలా పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఇలాంటి టైం లో థియేటర్స్ క్లోజ్ చేస్తే ముందు నష్టపోయేది వారే. అందుకని ప్రస్తుతానికి థియేటర్స్ మూసివేయాలని నిర్ణయాన్ని మార్చుకుని.. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారట. ఇక ముందు ముందు ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.