iDreamPost
android-app
ios-app

Crime: ప్రియురాలిని దారుణంగా చంపి.. 50 ముక్కలుగా నరికి..!

  • Published Nov 28, 2024 | 12:37 PM Updated Updated Nov 28, 2024 | 12:37 PM

Crime: జార్ఖండ్ లో దారుణమైన హత్య జరిగింది. ప్రియురాలిని దారుణంగా చంపాడు నిందితుడు.

Crime: జార్ఖండ్ లో దారుణమైన హత్య జరిగింది. ప్రియురాలిని దారుణంగా చంపాడు నిందితుడు.

Crime: ప్రియురాలిని దారుణంగా చంపి.. 50 ముక్కలుగా నరికి..!

ఎన్ని ఎన్ని ఎన్ని.. అని రాఖీ సినిమాలో తారక్ అన్నట్టు దారుణాలు చాలా ఘోరంగా పెరుగుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో ఒళ్ళు గగుర్పొడిచే దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తనతో డేటింగ్ చేస్తున్న యువతిని అతి దారుణంగా హత్య చేశాడు. అంతేగాక ఆమె శరీరాన్ని ఏకంగా 50 ముక్కలుగా నరికాడు ఈ రాక్షసుడు. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఈ అత్యంత దారుణమైన ఘటన జరిగింది. అసలేం జరిగింది? ఈ నీచుడు ఆమెను ఎందుకు ఇంత దారుణంగా చంపాడు? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జోర్దాగ్ గ్రామానికి చెందిన నరేష్ బెంగ్రా (25) గంగి కుమారి (24) అనే యువతితో రెండేళ్ల నుంచి డేటింగ్ చేస్తున్నాడు. అయితే ఈ బెంగ్రా గంగికి తెలియకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఈ విషయం గురించి ఇద్దరి మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు ఆ నీచుడు. ఈ నెల 24న యువతిని తన ఇంటికి దగ్గరలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి, అత్యాచారం చేసి గొంతు పిసికి చంపేశాడు. అంతేగాక ఆ యువతి శరీరాన్ని 50 ముక్కలుగా నరికి అడవిలోనే పారేశాడు. బాలిక బాడీలోని భాగాన్ని ఓ వీధీ కుక్క తినడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మరికొన్ని శరీర భాగాలతో పాటు, యువతి బ్యాగ్‌ ని కనుగొన్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నరేశ్ బెంగ్రాను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ఈ కేసును విచారించిన ఇన్‌స్పెక్టర్ అశోక్ సింగ్ మాట్లాడుతూ.. అతను తమిళనాడులోని ఒక మాంసం దుకాణంలో పని చేసినట్లు కనుగొన్నామని తెలిపారు.నిందితుడు ప్లాన్ ప్రకారమే, ఆమెను తన ఇంటి దగ్గరలోని ఆటోరిక్షాలో అటవీ ప్రాంతంలోనికి తీసుకెళ్లి, అక్కడ కొంచెం సేపు ఆమెను వెయిట్ చేయమన్నాడు. ఇక ఆ తరువాత అతను పదునైన ఆయుధాలతో తిరిగి వచ్చి, అత్యాచారం చేశాడు. ఇక ఆ తర్వాత ఆమెని గొంతు కోసి, ఆపై ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా నరికి వెళ్లిపోయాడు ఈ రాక్షసుడు. ప్రస్తుతం ఈ దారుణమైన ఘటన అంతటా సంచలనం రేపుతుంది. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ దారుణమైన ఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet Girişcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş