Vinay Kola
Telangana: తెలంగాణలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్ధిని ప్రాణం తీసింది ఇంగ్లీష్.
Telangana: తెలంగాణలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్ధిని ప్రాణం తీసింది ఇంగ్లీష్.
Vinay Kola
చిన్న చిన్న కారణాలకే చాలా మంది విద్యార్ధులు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొండంత ఆశలతో కని పెంచిన కన్నోళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. అయితే ఇందులో తల్లి దండ్రుల తప్పు కూడా ఉంది. చాలా మంది తల్లి దండ్రులు కూడా తమ పిల్లల ఇష్టాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పడంలో విఫలం అవుతున్నారు. ఇలా ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. కారణం తెలిస్తే..కచ్చితంగా షాక్ అవుతారు.అసలు ఇంతకీ ఏమైంది? ఆ చిట్టి తల్లి ఎందుకు ఆత్మ హత్య చేసుకుంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోతన్‌పల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికుల ప్రకారం.. పోతన్‌పల్లికి చెందిన నలాటుకూరి బానేశ్, కవిత దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో అనుశ్రీ (16) పెద్ద కూతురు. పదో తరగతి పూర్తి చేసిన అనుశ్రీ రామకృష్ణాపూర్‌లోని కస్తుర్బా కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. అది కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతుంది. అయితే అనుశ్రీ టెన్త్ దాకా తెలుగు మీడియంలో చదివింది. ఇంటర్మీడియెట్ మాత్రం ఇంగ్లిష్ మీడియంలో జాయిన్ అయ్యింది. అప్పటి దాకా తెలుగు మీడియంలో చదివి ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియంలోకి రావడంతో చాలా సతమతం అయ్యింది.. ఇంగ్షీషు క్లాసులు అర్ధంకాక ఎంతగానో ఇబ్బంది పడుతూ వచ్చింది ఆ చిట్టి తల్లి.
తనకు ఇంగ్లిష్ రావట్లేదని, అసలు క్లాసులు అర్థం కావడం లేదనీ, తనని తెలుగు మీడియంలో చేర్పించాలని తండ్రికి ఎన్నో సార్లు చెప్పింది. అయితే సెకండ్ ఇయర్ తెలుగు మీడియంలో చేర్పిస్తానని ఆ పాప తండ్రి సర్ధి చెప్పాడు. కానీ ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఆ పాప అఘాయిత్యం చేసుకుంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనుశ్రీ వ్యవయసాయానికి ఉపయోగించే గడ్డి మందు తాగింది. అది గమనించిప కుటుంబ సభ్యులు కంగారు పడుతూ మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అనుశ్రీని తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి అనుశ్రీ చనిపోయింది. తనని కన్న వారికి తీరని శోకం మిగిల్చింది. తమ బిడ్డ ఇలా ఆత్మహత్యకు పాల్పడి చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన స్థానీకులని కూడా కలిచి వేసిస్తుంది. ఇక ఈ విషాదకరమైన ఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.