Swetha
War 2 OTT: సినిమాలు థియేటర్ లో రిలీజ్ కాకముందే ఆయా సినిమాలకు ఉన్న హైప్ ని బట్టి OTT డీల్ లాక్ అయిపోతూ ఉంటుంది. అయితే వార్ 2 సినిమా రిలీజ్ కు ఇంకా చాలానే సమయం ఉన్నా సరే అప్పుడే డీల్ లాక్ అయిపోయింది. ఆ వివరాలు చూసేద్దాం.
War 2 OTT: సినిమాలు థియేటర్ లో రిలీజ్ కాకముందే ఆయా సినిమాలకు ఉన్న హైప్ ని బట్టి OTT డీల్ లాక్ అయిపోతూ ఉంటుంది. అయితే వార్ 2 సినిమా రిలీజ్ కు ఇంకా చాలానే సమయం ఉన్నా సరే అప్పుడే డీల్ లాక్ అయిపోయింది. ఆ వివరాలు చూసేద్దాం.
Swetha
మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ , బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ.. అనౌన్స్ చేసినప్పటినుంచి ఫ్యాన్స్ లో హైప్ మొదలైంది. ఎప్పుడెప్పుడు ఆ ఇద్దరి కాంబోని తేర మీద చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. పైగా తారక్ కు మొదటి స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ. ఇక రీసెంట్ గా తారక్ బర్త్ డే సందర్బంగా వార్ 2 టీజర్ ను రిలీజ్ చేశారు. దీనితో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు.
ఇక సినిమా విషయానికొస్తే దాదాపు అంతా పూర్తయినట్లే అని టాక్. ఇంకా హృతిక్ తారక్ మధ్య సాంగ్ ఒకటి బ్యాలన్స్ ఉందట. అది కూడా పూర్తిచేసుకుని మూవీ టీం ప్రమోషన్స్ మీద ద్రుష్టి పెట్టె పనిలో ఉన్నారు. ఆల్రెడీ సౌత్ లో తారక్ కు బాగానే క్రేజ్ ఉంది. ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని దాదాపు పాన్ ఇండియా వైడ్ తారక్ ఓ ఇమేజ్ ఉంది. సో అక్కడి ప్రేక్షకులు అతనిని బాగానే ఆదరిస్తారని అనుకుంటున్నారు అంతా. సినిమా రిలీజ్ కు ఇంకా చాలానే సమయం ఉంది. కానీ ఇప్పుడు సినిమా మీద ఉన్న హైప్ కారణంగా అప్పుడే ఈ మూవీ OTT డీల్ క్లోజ్ అయిందట. ఈ సినిమాను ప్రముఖ OTT పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.