iDreamPost
android-app
ios-app

అబ్దుల్ కలాం బయో పిక్ తో.. ఓం రౌత్

  • Published May 22, 2025 | 10:31 AM Updated Updated May 22, 2025 | 10:31 AM

Abdul kalam Biopic: రీసెంట్ గా సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే మీద బయో పిక్ తీస్తున్నట్లుగా కొన్ని వార్తలు వినిపించాయి. ఆ కథలో హీరో ఎవరు అనేది ఇంతవరకు తేలలేదు. ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తి బయోపిక్ గురించి టాక్ వినిపిస్తుంది. అదే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర. ఈ బయోపిక్ ను ఓం రౌత్ తీయబోతున్నాడట.

Abdul kalam Biopic: రీసెంట్ గా సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే మీద బయో పిక్ తీస్తున్నట్లుగా కొన్ని వార్తలు వినిపించాయి. ఆ కథలో హీరో ఎవరు అనేది ఇంతవరకు తేలలేదు. ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తి బయోపిక్ గురించి టాక్ వినిపిస్తుంది. అదే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర. ఈ బయోపిక్ ను ఓం రౌత్ తీయబోతున్నాడట.

  • Published May 22, 2025 | 10:31 AMUpdated May 22, 2025 | 10:31 AM
అబ్దుల్ కలాం బయో పిక్ తో.. ఓం రౌత్

సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల జీవిత చరిత్రల మీద సినిమాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఉన్నత వ్యక్తుల జీవితాల గురించి అందరికి తెలియపరచడం గొప్ప విషయమే. కానీ దానిని తెరమీద ఎలా తీర్చిదిద్దారు అనే దానిమీదే ఆ కథలోని సారాంశానికి అర్ధం తీసుకు వచ్చేలా చేస్తుంది.రీసెంట్ గా సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే మీద బయో పిక్ తీస్తున్నట్లుగా కొన్ని వార్తలు వినిపించాయి. ఆ కథలో హీరో ఎవరు అనేది ఇంతవరకు తేలలేదు. ఇటు ఎన్టీఆర్ , అటు అమీర్ ఖాన్ ఇద్దరు దీని కోసం పోటీ పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాకముందే. ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తి బయోపిక్ గురించి టాక్ వినిపిస్తుంది. అదే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర. ఈ బయోపిక్ ను ఓం రౌత్ తీయబోతున్నాడట.

ఆదిపురుష్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ కు ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. పైగా ఆ సినిమా రిలీజ్ సమయంలో సోషల్ మీడియాలో ఓం రౌత్ మీద పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. అయితే ఇదంతా గతం. ఎంత సక్సెసఫుల్ డైరెక్టర్ అయినా కనీసం ఒక్కసారైనా ఇవన్నీ ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు వర్తమానానికి వస్తే మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాం బయోపిక్ బయో పిక్ తో ఓం రౌత్ బంపర్ ఆఫర్ కొట్టేసాడు. టి సిరీస్, ఏకె ఎంటర్ టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ లాంటి భారీ నిర్మాణ సంస్థలు ఈ ప్యాన్ ఇండియా మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంకా ఈ బయో పిక్ లో అసలు విశేషం ఏంటంటే ఇందులో మెయిన్ రోల్ ధనుష్ పోషిస్తున్నాడట. ధనుష్ పెర్ఫామెన్స్ గురించి తెలియనిది కాదు. ఆ పాత్రకు తగిన న్యాయం చేస్తాడని అంతా బలంగా నమ్ముతున్నారు. దీనికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

అయితే ఇది ఎంతో ప్రత్యేకమైన జీవిత చరిత్ర కాబట్టి.. ఈసారైనా ఓం రౌత్ ప్రేక్షకులను మెప్పించేలా తీస్తే బావుంటుందని అంతా అనుకుంటున్నారు. ఓ గొప్ప శాస్త్రవేత్త ఎంతో మందికి ఆదర్శమైన వ్యక్తి చరిత్ర ఇంకో పది తరాలు గర్వంగా చెప్పుకునేల తెరమీద చూపించాలని ఆశిస్తున్నారు. అబ్దుల్ కలాం జీవిత చరిత్ర నుంచి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు నేర్చుకోవచ్చు.. ముఖ్యంగా యువత నేర్చుకోవాల్సిన ఎన్నో గొప్ప పాఠాలు ఈ కథలో కనిపిస్తాయి. సో ఇప్పుడు తెరమీద దీనిని అర్థవంతంగా అందంగా తీర్చిదిద్దడమే ఓం రౌత్ ముందు ఉన్న పెద్ద సవాల్. ఇక ఏమౌతుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.