Swetha
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులనే కాదు.. పెద్ద పెద్ద దర్శకులను సైతం ఇంప్రెస్ చేస్తాయి. అది కేవలం తెలుగులో మాత్రమే ఉండాలని రూల్ కూడా లేదు. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన తమిళ సినిమా టూరిస్ట్. ప్రపంచమంతా జక్కన మహేష్ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటే.. జక్కన్న మాత్రం టూరిస్ట్ ఫ్యామిలీ గురించి అప్డేట్ ఇచ్చాడు

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులనే కాదు.. పెద్ద పెద్ద దర్శకులను సైతం ఇంప్రెస్ చేస్తాయి. అది కేవలం తెలుగులో మాత్రమే ఉండాలని రూల్ కూడా లేదు. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన తమిళ సినిమా టూరిస్ట్. ప్రపంచమంతా జక్కన మహేష్ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటే.. జక్కన్న మాత్రం టూరిస్ట్ ఫ్యామిలీ గురించి అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా జక్కన్నను కూడా ఇంప్రెస్ చేసిందట.
‘అద్భుతమైన సినిమా చూశా.. హృదయాన్ని కదిలించింది, అలాగే కడుపుబ్బా నవ్వించింది.. ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రతి సీన్ ఆసక్తికరంగా ఉంది. అభిషన్ జీవింత్ గొప్పగా రాసి తెరకెక్కించాడు. ఇటీవలి కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇది. ఎవరూ మిస్ అవ్వొద్దు.. తప్పకుండా చూడండి’ అంటూ రివ్యూ ఇచ్చారు రాజమౌళి. దీనితో ఈ సినిమా మీద ఇంకాస్త పాజిటివ్ ఒపీనియన్ పెరిగింది. ఇక మూవీ లవర్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు OTT లోకి వస్తుందా.. అసలు ఏ రకమైన కంటెంట్ ఉందా అని ఎదురుచూస్తున్నారు.
మే 1 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది.. అలాగే మే 24 న జపాన్ లో కూడా ఈ మూవీ విడుదల కానుంది. అయితే మే 31 నుంచి ఈ సినిమా జియో హాట్స్టార్ లో తెలుగులో తమిళ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు.. మూవీ మేకర్స్ గతంలో వెల్లడించారు. OTT రూల్స్ ప్రకారం సినిమా మే 31కి స్ట్రీమింగ్ కు రావాలి. కానీ ఇప్పుడు మూవీపై పాజిటివ్ టాక్ పెరగడంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ఇప్పట్లో పూర్తయ్యేల లేదు. రూ.16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ మూవీ ఇప్పటివరకు రూ. 75 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.