iDreamPost
android-app
ios-app

ప్రతి సినీ ప్రియుడు సెలబ్రేట్ చేయాల్సిన రీ రిలీజ్

  • Published May 22, 2025 | 11:50 AM Updated Updated May 22, 2025 | 11:50 AM

Mayabazar Re Release: గత మూడేళ్ళుగా ఈ రీరిలీజ్ ల ట్రెండ్ అనేది ప్రేక్షకులలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకైనా వెళ్లడం ఆగిపోతున్నారేమో కానీ.. రీరిలీజ్ లకు మాత్రం కచ్చితంగా వెళ్తున్నారు ప్రేక్షకులు. ఇక సాంగ్స్ అద్భుతంగా ఉండే సినిమాను రీరిలీజ్ చేస్తే... ఆరోజు థియేటర్ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లా మారిపోతుంది.ఇక ఇప్పుడు మరో పాతతరం సినిమా రీరిలీజ్ కానుంది.

Mayabazar Re Release: గత మూడేళ్ళుగా ఈ రీరిలీజ్ ల ట్రెండ్ అనేది ప్రేక్షకులలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకైనా వెళ్లడం ఆగిపోతున్నారేమో కానీ.. రీరిలీజ్ లకు మాత్రం కచ్చితంగా వెళ్తున్నారు ప్రేక్షకులు. ఇక సాంగ్స్ అద్భుతంగా ఉండే సినిమాను రీరిలీజ్ చేస్తే... ఆరోజు థియేటర్ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లా మారిపోతుంది.ఇక ఇప్పుడు మరో పాతతరం సినిమా రీరిలీజ్ కానుంది.

  • Published May 22, 2025 | 11:50 AMUpdated May 22, 2025 | 11:50 AM
ప్రతి సినీ ప్రియుడు సెలబ్రేట్ చేయాల్సిన రీ రిలీజ్

ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలను రీరిలీజ్ చేస్తుంటే దానిని ఓ పండగలా జరుపుకుంటున్నారు. గత మూడేళ్ళుగా ఈ రీరిలీజ్ ల ట్రెండ్ అనేది ప్రేక్షకులలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకైనా వెళ్లడం ఆగిపోతున్నారేమో కానీ.. రీరిలీజ్ లకు మాత్రం కచ్చితంగా వెళ్తున్నారు ప్రేక్షకులు. ఇక సాంగ్స్ అద్భుతంగా ఉండే సినిమాను రీరిలీజ్ చేస్తే… ఆరోజు థియేటర్ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లా మారిపోతుంది. అయితే రీసెంట్ గా 35 ఏళ్ళ తర్వాత చిరంజీవి శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ కాలం నాటి సినిమా ఇప్పటి తరం వారి దృష్టిని కూడా ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు మరో పాతతరం సినిమా రీరిలీజ్ కానుంది. ఇంకాస్త వెనక్కు వెళ్లి 68 ఏళ్ల నాటి క్లాసిక్ సినిమాను మరోసారి తెరమీదకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే మాయాబజార్ సినిమా. ఎన్నో సంవత్సరాలు గడిచినా తరాలు మారిన ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు , సినిమా ప్రియుడు గర్వంగా చెప్పుకునే సినిమా ‘మాయ బజార్’. ఇప్పటివరకు కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే ఫ్యాన్ వార్స్ జరిగేవి. కానీ ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం అవేమి ఉండవు. ఈ తేడాలు అన్నీ పక్కన పెట్టి అందరు కలిసి గొప్పగా సెలెబ్రేట్ చేసుకునే సినిమా మాయాబజార్.

రైటింగ్ , టేకింగ్ , యాక్షన్ ఇలా ఒక్కటేంటి ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను సినిమాతో ప్రేమలో పడేసేలా చేస్తుంది. ఇప్పటికి కూడా ఈ సినిమా నుంచి నేర్చుకోడానికి ఎన్నో పాఠాలు మిగిలి ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలు దాటిపోయినా సరే ఇప్పటికి సినిమా చూస్తే మాత్రం ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఏ రీరిలీజ్ ను మిస్ అయినా కానీ ఈ రీరిలీజ్ మాత్రం అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల చివరి వారంలో ‘మాయాబజార్’ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీరిలీజ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.