iDreamPost

మాతృత్వానికి మచ్చతెచ్చిన తల్లి.. కన్నబిడ్డలను రెండో భర్త పరం చేసిన మహిళ!

మాతృత్వానికి మచ్చతెచ్చిన తల్లి.. కన్నబిడ్డలను రెండో భర్త పరం చేసిన మహిళ!

అమ్మ  అనే పదానికి ఎంతో విలువ ఉంది. ఎందుకంటే.. అమ్మ..తన బిడ్డల కోసం చేసే త్యాగం అంతలా ఉంటది. బిడ్డల సుఖమే తన సుఖమని భావించే తల్లులు ఎందరో ఉన్నారు. కానీ నేటికాలంలో తమ సుఖమే ముఖ్యమనే అమ్మల సంఖ్య బాగా పెరిగిపోతున్నారు. తమ సుఖం కోసం బిడ్డలను ఎలా చేయడానికైన సిద్ధ పడుతున్నారు. పరాయి వారితో తమ శారీర సుఖానికి అడ్డుగా ఉన్నారని పిల్లలను హత్య చేస్తున్నతల్లు ఎందరో ఉన్నారు. తాజాగా మరో మహిళ.. తన కన్న బిడ్డలకే శత్రువైంది. మాతృత్వానికి మచ్చతెచ్చేలా.. దారుణంగా వ్యవహరించింది. వయసొచ్చిన బిడ్డలను రెండో భర్త పరం చేసింది.  ఈ అమానవీయ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామంలో ఓ మహిళ నివాసం ఉంటుంది. ఆ మహిళకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఈ నేపథ్యంలోనే 2007లో ఆమె భర్త అనారోగ్యంతో మరణించాడు. కొంతకాలనికి ఆమె మేనత్త కొడుకును సదరు మహిళ రెండో పెళ్లి చేసుకుంది. వివాహం జరిగిన కొంతకాలానికి తనకు పిల్లలు కావాలని, లేదంటే మరో పెళ్లి చేసుకుంటానని సదరు మహిళను.. ఆమె రెండో భర్త బెదరించాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్లకు.. ఆమె కూతుళ్లు యుక్త వయసుకు వచ్చారు. వేరే పెళ్లి చేసుకోవద్దని, తన కూతుళ్లతోనే పిల్లల్ని కనాలని అతడిని ఒప్పించింది. ఈ క్రమంలోనే 17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత మగ పిల్లాడి కోసం తన రెండో కుమార్తెను భర్తకు అప్పగించింది.

ఆమెకు కూడా  మగ శిశువు జన్మించి చనిపోయాడు. ఇటీవలే ఆ దంపతుల మధ్య విభేదాలు రావడంతో..కుమార్తెలను  గ్రామంలోనే వదిలేసి.. వైజాగ్ లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్న కూతురు.. తనకు పరిచయమైన ఓ యువకుడికి ఈ స్టోరీ అంత చెప్పింది. అతడు ఆ యువతుల మేనమామకు తెలిపాడు.దీంతో బంధువులంతా ఏలూరు వచ్చి బాధితులతో దిశ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన తెలిసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన సుఖం కోసం పిల్ల బంగారు జీవితాన్ని బలిచేసిందని, అసలు ఆమె తల్లేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మాతృత్వానికే మచ్చతెస్తున్న ఇలాంటి మహిళకు ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి