మహిళలకు గుడ్ న్యూస్! ఇంటి వద్ద ఉంటూ ఫ్రీగానే..

మహిళలకు గుడ్ న్యూస్! ఇంటి వద్ద ఉంటూ ఫ్రీగానే..

చాలా మంది మహిళలకు ఉద్యోగాలు చేసే అవకాశం ఉండదు. నివాసం ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి కుటుంబానికే పరిమితమైపోతుంటారు. అయితే అలాంటి వాళ్లు ఇంటి వద్దనే ఉంటూ ఉపాధి పొందాలని భావిస్తుంటారు.

చాలా మంది మహిళలకు ఉద్యోగాలు చేసే అవకాశం ఉండదు. నివాసం ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి కుటుంబానికే పరిమితమైపోతుంటారు. అయితే అలాంటి వాళ్లు ఇంటి వద్దనే ఉంటూ ఉపాధి పొందాలని భావిస్తుంటారు.

నేటికాలంలో చాలా మంది మహిళు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు.  ఉద్యోగాలు, వ్యాపారాలు ఇతర రంగాల్లో మహిళలు మగవారికి పోటీగా రాణిస్తున్నారు. అయితే ఇది అంతా పట్టణ ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు స్వయం ఉపాధి అనేది చాలా అవసరం. వారి కాళ్ల మీద వారు నిలబడితే, కుటుంబానికి కూడా ఎంతో ఆర్థిక భరోసా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు తరచూ ఏదో ఒక శుభవార్త వచ్చింది. కేవలం రేషన్ కార్డు ఉంటే చాలు మీకు ఓ మంచి అవకాశం ఉంది. అయితే ఇది కేవలం కర్నూలు  జిల్లా ప్రాంత పరిధిలోని గ్రామీణ మహిళకు మాత్రమే ఉంది. మరి.. ఆ గుడ్ న్యూస్ వివరాలు ఏమిటోఇప్పుడు చూద్దాం…

చాలా మంది మహిళలకు ఉద్యోగాలు చేసే అవకాశం ఉండదు. నివాసం ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి కుటుంబానికే పరిమితమైపోతుంటారు. అయితే అలాంటి వాళ్లు ఇంటి వద్దనే ఉంటూ ఉపాధి పొందాలని భావిస్తుంటారు. అలా ఇంటివద్దే ఉంటూ ఆర్ధికంగా స్థిరపడాలి అనుకుంటున్నా మహిళకు బెస్ట్ ఛాయిస్ దొరికింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్  మంచి అవకాశం కల్పించింది. ఈ బ్యాంక్ కు చెందిన స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందు కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా బ్యూటీ పార్లర్ కోర్స్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ జోనల్ డైరెక్టర్ బి. శివ ప్రసాద్ తెలిపారు.

ఈ సందర్భంగా జోనల్ డైరెక్టర్ బి శివ ప్రసాద్ పలు విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు తమ సంస్థ ఆధ్వర్యంలో ఎంతోమంది మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పలు రంగాల్లో ఉచిత శిక్షణ అందించారు. అలనే ఎంతో మందికి ఉచిత శిక్షణ కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ప్రస్తుతం బ్యూటీ పార్లర్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.  నేటికాలంలో బ్యూటీ పార్లర్ల  మంచి డిమాండ్ ఉంది.

అలానే ఈ కోర్సు ఆడవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏదైనా శుభకార్యాలు, పెళ్లిళ్లు, లంగాఓణి ఫంక్షన్లు.. ఇలా ఎలాంటి కార్యక్రమాలు జరిగిన మహిళలు అందంగా రెడీ అయ్యే సంగతి తెలిసిందే. అలాంటి  వారికి స్థానికంగా మేకప్ చేసే వారు అందుబాటులో ఉండారు. ఈ బ్యూటీ పార్లర్  నేర్చుకోవడం ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. మహిళలు ఎంతో ఇష్టపడే ఈ బ్యూటీ పార్లర్ల వర్క్ నేర్చుకుని, చేసే మేకప్ వారికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు కూడా శిక్షణ ఇస్తామని ఆయన జోనల్ డైరెక్టర్ తెలిపారు. ఈ కోర్సు వారికి ఇంటి దగ్గరే ఉంటూ సంపాదించుకునేందుకు ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

ఈ బ్యూటీ పార్లర్ ఉచిత శిక్షణ శిబిరం జూన్ 19వ తేదీన ప్రారంభమయ్యే 30 రోజులపాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం కోర్సు పూర్తి చేసుకున్న వారికి తమ సంస్థ నుంచి గుర్తింపు సర్టిఫికెట్ అందజేస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ట్రైనింగ్ పిరియడ్ లో అభ్యర్థులకు ఉచిత హాస్టల్ వసతితో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ఇక బ్యూటీ పార్లర్ నేర్చుకోవాలనే ఆసక్తిగల అభ్యర్థులు ఆరు ఫోటోలు, ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, విద్యార్హత ధ్రువపత్రాలు తీసుకొని తమ ఆఫీస్ కి రావాలని సూచించారు. కల్లూరు పట్టణంలోని కెనరా బ్యాంక్ పైన ఉన్న రెండవ అంతస్తులో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆఫీస్ లో రిజిస్టర్ చేయించుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 90007 10508 అనే నంబర్ను సంప్రదించాలని కోరారు. మొత్తంగా ఈ శిక్షణ తీసుకోవడం ద్వారా ఎటువంటి పెట్టుబడి లేకుండానే ఇంటి వద్ద నుంచి ఆదాయం పొందవచ్చు.

Show comments