Vinay Kola
OLA: ఓలా కంపెనీ తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. వీటి ఫీచర్లు సూపర్ అనే చెప్పాలి.
OLA: ఓలా కంపెనీ తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. వీటి ఫీచర్లు సూపర్ అనే చెప్పాలి.
Vinay Kola
ఫేమస్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్.. సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. తక్కువ ధరకే వీటిని అందిస్తోంది. గిగ్, ఎస్1 జడ్ సిరీస్ లో ఈ కొత్త స్కూటర్లు తీసుకొచ్చింది. గిగ్ సిరీస్ లో ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్ స్కూటర్లు ఉన్నాయి. గిగ్ సిరీస్ స్కూటర్లను 2025 ఏప్రిల్ నెల నుంచి డెలివరీ చేస్తామని, అదే ఎస్1 జడ్ స్కూటర్ల డెలివరీని 2025, మే నెల నుంచి స్టార్ట్ చేస్తామని ఓలా తెలిపింది. ఇక ఈ స్కూటర్లు ఫీచర్ల గురించి తెలిస్తే కచ్చితంగా వావ్ అనాల్సిందే. ఇక వీటి ధర, పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గిగ్ స్కూటర్లను కేవలం రూ.39,999 నుంచి రూ.49,999లకే అందిస్తున్నట్లు ఓలా తెలిపింది. ఇక ఎస్1 జడ్ స్కూటర్లను రూ.59,999లకు ఎస్1 జడ్ ప్లస్ స్కూటర్లను రూ.64,999కి అందిస్తున్నట్లు తెలిపింది.ఈ కొత్త స్కూటర్లను కొనేందుకు ముందుగా రూ.499 చెల్లించి నవంబర్ 26 నుంచే వీటిని బుక్ చేసుకోవచ్చని ఓలా ఓ ప్రకటన కూడా చేసింది. వీటిలో పోర్టబుల్ బ్యాటరీ ఫీచర్ ఉందని తెలిపింది. అంటే బ్యాటరీని మనం మార్చుకోవచ్చు. గిగ్ వర్కర్ల కోసం ఓలా గిగ్ (Ola Gig) మోడల్ ని తయారు చేశారు. తక్కువ దూరాల ప్రయాణానికి వీలుగా 1.5 కిలోవాట్ అవర్ రిమూవబుల్ బ్యాటరీని ఫిక్స్ చేశారు. ఇక దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 112 కిలోమీటర్లు వెళ్తుంది. దీని మాక్సిమం స్పీడ్ 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఓలా గిగ్ ప్లస్ ని (Ola Gig+) దూర ప్రయాణాలు చేసే గిగ్ వర్కర్ల కోసం తయారు చేశారు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 45 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి 1.5 కిలోవాట్ అవర్ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 81 కిలోమీటర్లు వెళ్తుంది. దీని రెండు బ్యాటరీల సహయంతో అయితే 157 కిలోమీటర్లు వెళ్లొచ్చు.
ఇక ఓలా ఎస్1 జడ్ (Ola S1 Z) స్కూటర్‌ని తక్కువ ధరలో వ్యక్తిగత అవసరాల కోసం తయారు చేశారు. ఇందులో 1.5 కిలోవాట్ అవర్ డ్యూయల్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ బ్యాటరిపై 75 కిలోమీటర్లు, డ్యూయల్ బ్యాటరీ అయితే 146 కిలోమీటర్లు వెళ్తుంది. ఇది 70 కిలోమీటర్ల స్పీడ్ కలిగి ఉంది. దీనికి ఫిజికల్ కీ, ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటాయి. ఓలా ఎస్1 జడ్ ప్లస్ (Ola S1 Z+) స్కూటర్ ని పర్సనల్, కమర్షియల్ అవసరాల కోసం డిజైన్ చేశారు.దీనిలో 1.5 కిలోవాట హవర్ డ్యూయల్ బ్యాటరీ ఉంటుంది. ఒక బ్యాటరీతో 75 కిలోమీటర్లు, రెండు బ్యాటరీలతో 146 కిలోమీటర్లు వెళ్ళవచ్చు. దీని టాప్ స్పీడ్ 70 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఓలా పవర్‌పాడ్ స్కూటర్ ఇంటి పనులకు బాగా ఉపయోగపడుతుంది. పైగా ఓలా పోర్టబుల్ బ్యాటరీని ఇన్వెర్టర్‌లో కూడా వాడుకోవచ్చు. 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ సాయంతో 5 ఎల్ఈడీ లైట్స్, 3 సీలింగ్ ఫ్యాన్లు, 1 టీవీ, 1 మొబైల్, 1 వైఫై రూటర్ వంటివి ఏకంగా 3 గంటల పాటు వాడుకోవచ్చు.