Keerthi
Vijayawada Floods: విజయవాడ వరదల్లో మానవత్వం చూపిన ఓ యువకుడి పట్ల.. విధి చిన్నచూపు చూసింది. ఎలాగైనా సరే ఆ నలుగురిని కాపాడలనే అతని ఆశయం దేవుడికి కూడా గిట్టనట్టు ఉంది. అందుకే ఆ కుటుంబంలో ఊహించని విధంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Vijayawada Floods: విజయవాడ వరదల్లో మానవత్వం చూపిన ఓ యువకుడి పట్ల.. విధి చిన్నచూపు చూసింది. ఎలాగైనా సరే ఆ నలుగురిని కాపాడలనే అతని ఆశయం దేవుడికి కూడా గిట్టనట్టు ఉంది. అందుకే ఆ కుటుంబంలో ఊహించని విధంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Keerthi
గత ఐదు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఎంతటి భీభత్సం సృష్టించయో.. ఆ దృశ్యలు ఇప్పటికి కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ భారీ వర్షాలు విజయవాడపై ఎక్కువగా ప్రభావం చూపాయి. దీంతో ఆ నగరం మొత్తం వరద ముంపుతో ముంచెత్తింది. దీంతో చాలా వరకు రహదారులన్ని జలమయమైయ్యి దెబ్బతిన్నాయి. అలాగే కొన్ని ప్రాంతాలు నీట మునగాడమే కాకుండా.. ప్రజలంతా అతలాకుతలమైయ్యారు. మరి, కొంతమంది ఈ నీటి ఉద్ధృతికి ప్రాణాలు సైతం పొగొట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. విజయవాడలో ముంచెత్తిన ఈ వరద ముంపు ఎన్నో కుటుంబాలను ఛిన్నభిన్నం చేస్తూ.. ఉక్కిరిబిక్కిరి చేసింది. తాజాగా ఓ కుటుంబంలో కూడా ఈ వరద ముంపు ఊహించని విధంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ నలుగురిని కాపాడాలనే ఓ వ్యక్తి ఆశయం, విధికి కూడా గిట్టనట్టు ఉంది. అందుకే చివరికి అతని ప్రాణాలను బలి తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
విజయవాడ వరదల్లో మానవత్వం చూపిన ఓ యువకుడు.. చివరికి తిరిగిరాని లోకానికి వెళ్లాడు. ఎలాగైనా సరే తన సోదరులతో పాటు మరో ఇద్దరి యువకులను కాపాడాలనే అతని చేసిన సాహసం ఆయన ప్రాణలనే బలి తీసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్(32)కు సింగ్ నగర్ లో ఓ డెయిరీఫాం ఉంది. అయితే ఎప్పటిలానే ఆదివారం నాడు కూడా భారీ వర్షం కురస్తున్నసరే.. చంద్రశేఖర్ తన ఇద్దరు సోదరులు కోటేశ్వరావు, శ్యామ్ సుందర్, మరో ఇద్దరు యువకులు ఆ డైయిరీఫాంలో పనిచేస్తున్నారు. ఇలా ఎవరీ పనుల్లో వారు ఉన్న సమయంలో ఒక్కసారిగా ప్రలయం వరద రూపంలో ముంచుకొచ్చింది. ఒక్కసారిగా భారీ వరద పొటిత్తడంతో.. చంద్రశేఖర్ ఇద్దరి సోదురులతో పాటు మరో ఇద్దరు యువకులు కొట్టుకుపోతున్నారు.
అయితే కళ్లముందే తన సోదరులు, తనతో నమ్మకంగా పనిచేసే యువకులు ప్రాణాలు పోతుంటే చలించుకుపోయిన చంద్రశేఖర్.. ఎలాగైనా వారిని కాపాడాలని తన ప్రాణాలను మృత్యువుకే ఎదురెళ్లాడు. ఆ వరదలో చాలా సహసం చేసి తన ఇద్దరి సోదరులను, మరో ఇద్దరి యువకులను కాపాడి , డెయిరీఫాం షెడ్డు పైకప్పు పైకి చేర్చాడు. ఇక వారి ప్రాణాలతో పాటు నా ప్రాణాలను కాపాడుకుంటే సరిపోతుందని అనుకోలేదు చంద్రశేఖర్. తమ జీవన ఆధారంగా నిలిచిన మూగజీవులను కూడా కాపాడాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తాళ్లతో కట్టి ఉంచిన 50 ఆవులను రక్షించేందుకు వెళ్లాడు. ఇక ఎక్కడో ఒకచోటు అవి కూడా ప్రాణాలతో ఉంటాయని భావించి వాటి తాళ్లను విడదీశాడు. ఆ తర్వాత నెమ్మదిగా తాను ఈదుకుంటూ వెనక్కి వచ్చి తన డైయిరీఫాం పై కప్పు ఎక్కేందుకు ప్రయత్నించాడు.
కానీ, దురదృష్టవశత్తు విధి ఆయనపై చిన్నచూపు చూసింది. ఆ నలుగురిని ప్రాణాలు కాపాడిన యువకుడు తన ప్రాణాలను మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. పై కప్పు ఎక్కుతుండగా.. కాలుజారి కింద పడడంతో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. అయితే మంగళవారం డెయిరీఫాంకు 500 మీటర్ల దూరంలో చంద్రశేఖర్ మృతదేహం దొరికింది. ఇకపోతే తమను కాపాడి కళ్ల ముందే అన్న కొట్టుకుపోయాడంటూ సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు. కానీ బాధకర విషయమేటంటే.. చంద్రశేఖర్ భార్య ప్రస్తుతం 8 నెలల గర్భిణి. కనీసం పుట్టబోయే బిడ్డ, కడుపుతో ఉన్న తన భార్య కోసం కూడా ఆలోచించకుండా.. నలుగురిని కాపాడి తన ప్రాణాలు పోగొట్టుకున్న ఈ విషాద ఘటనపై స్థానికలంతా కంటతడి పెట్టారు.