iDreamPost

ముంబై అడ్డాలో తెలుగు టాలెంట్

ముంబై అడ్డాలో తెలుగు టాలెంట్

మన సౌత్ లోని హీరోలకు కాని దర్శకులకు కాని బాలీవుడ్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ వ్యామోహం. అందుకే చిరంజీవి మొదలుకుని ప్రభాస్ అందరూ ఏదో ఒక రూపంలో అక్కడ జెండా పాతాలని చూసినవాళ్ళే. హీరోలైతే సమస్య లేదు. దర్శకులు కూడా ఆకర్షితులైతేనే ఇబ్బంది. ఎలా అంటారా. కారణం ఉంది. అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో అందరికి తన వైపు చూసేలా మార్చుకున్న సందీప్ రెడ్డి వంగా దాని తర్వాత మళ్ళీ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయనే లేదు. ఇది జరిగి మూడేళ్లు దాటింది.

హిందీ రీమేక్ కబీర్ సింగ్ ఆఫర్ రావడంతో అటు సైడ్ వెళ్ళిపోయి అక్కడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇతని వెంట పడుతుండటంతో అక్కడే మరో క్రైమ్ థ్రిల్లర్ ప్లాన్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ సందీప్ కొత్త సినిమా ఏది అనే విషయంలో క్లారిటీ లేదు. అర్జున్ రెడ్డితో తన టాలెంట్ చూపించిన దర్శకుడి పరిస్థితి ఇది. 

ఇక గత ఏడాది న్యాచురల్ స్టార్ నానితో జెర్సి లాంటి ఎమోషనల్ హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి సైతం ఇదే తరహాలో అక్కడే చిక్కుబడిపోయాడు. కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ జెర్సి మీద కూడా మనసు పడటంతో ఒరిజినల్ ఫీల్ మిస్ కాకుండా హిందీ రీమేక్ కోసం అతన్నే తీసుకెళ్లిపోయారు. మరో ఏడాది గౌతమ్ తిరిగి వచ్చే అవకాశం లేదు.

ఒకవేళ జెర్సి హిందీ వెర్షన్ కూడా పెద్ద హిట్ అయితే ఇంకో ఆఫర్ ఏదో పెద్ద సంస్థ నుంచి వస్తే కాదనలేని పరిస్థితి రావొచ్చు. ఇదే కనక ఇలా రిపీట్ అవుతూ వెళ్తే యంగ్ టాలెంటెడ్ యూత్ అంతా ముంబైలో సెటిల్ అయిపోతారు. ఇప్పటికీ తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు యాక్టింగ్ వైపు టర్న్ అయిపోయి కొత్త కథల గురించి వర్క్ అవుట్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రూవ్ చేసుకున్న దర్శకులు ముంబైలో ఉండిపోతే మనకు మళ్ళీ రొటీన్ ఫార్ములా కథలు తప్పవు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి