iDreamPost

భర్త చేసిన ఆ పని.. భార్య పాలిట శాపంగా.. అసలు ఏం జరిగిందంటే?

నిండు నూరేళ్లు ఆదర్శదంపతులుగా ఉండాల్సిన వారు వివాహేతర సంబంధాలతో విడిపోతున్నారు. పర స్త్రీ మోజులో పడి ప్రాణాలు తీయడమో లేదా ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు.

నిండు నూరేళ్లు ఆదర్శదంపతులుగా ఉండాల్సిన వారు వివాహేతర సంబంధాలతో విడిపోతున్నారు. పర స్త్రీ మోజులో పడి ప్రాణాలు తీయడమో లేదా ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు.

భర్త చేసిన ఆ పని.. భార్య పాలిట శాపంగా.. అసలు ఏం జరిగిందంటే?

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలతో కుటుంబాల్లో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. పచ్చని సంసారాల్లో చిచ్చు రగులుతోంది. పరాయి వ్యక్తి మోజులో పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని కడతేర్చేందుకు కూడా వెనకాడడం లేదు. నిండు నూరేళ్లు అన్యోన్యంగా కలిసి జీవించాల్సిన వారు కుటుంబకలహాలతో తనువులు చాలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ భర్త భార్య పాలిట శాపంగా మారాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్యను దారుణంగా అంతమొందించాడు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

జీవితాంతం ప్రేమను పంచాల్సిన భర్త పర స్త్రీ మోజులో పడి భార్యను చున్నీతో ఉరివేసి చంపాడు. ఇద్దరు పిల్లలకు తల్లిని లేకుండా చేశాడు. ఈ ఘటన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆకుదారివాడ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మల్హర్‌ మండలం అనుసాన్‌పల్లి గ్రామానికి చెందిన ఇస్లావత్‌ సుమత(30)ను 2016లో ఆకుదారివాడలో నివాసం ఉంటున్న ఇస్లావత్‌ హతిరాంనకు ఇచ్చి వివాహం చేశారు. కొన్నేళ్లు కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. గత కొంత కాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో రెండుసార్లు గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అయినా అతడిలో మార్పు రాలేదు. కాగా మంగళవారం ఉదయం హతీరాం పనికి వెళ్లాడు. ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలను పాఠశాలకు పంపించి.. సుమత ఇంటి సమీపంలో సింగరేణి ఓసీ-2 గని సమీపంలో ఖాళీగా ఉన్న పాత ఇళ్ల ప్రాంతంలో గొర్రె పిల్లను మేత కోసం తీసుకెళ్లింది. ఈక్రమంలో మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన హతీరాం భార్య వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. ఈ గొడవ కాస్త పెద్దదై క్షణికావేశంలో ఆమెను చున్నీతో ఉరేసి చంపాడు. ఆ తర్వాత ఒంటిపైనున్న బంగారు గొలుసు తీసుకున్నాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి