iDreamPost

IND vs SA: సౌతాఫ్రికాతో ఫైనల్.. టీమిండియాలో కొత్త టెన్షన్! ఏంటంటే?

సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియాలో కొత్త టెన్షన్ మెుదలైంది. దాంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఆ టెన్షన్ కు కారణం ఏంటంటే?

సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియాలో కొత్త టెన్షన్ మెుదలైంది. దాంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఆ టెన్షన్ కు కారణం ఏంటంటే?

IND vs SA: సౌతాఫ్రికాతో ఫైనల్.. టీమిండియాలో కొత్త టెన్షన్! ఏంటంటే?

టీమిండియా వరల్డ్ కప్ గెలిచి 13 సంవత్సరాలు కావొస్తోంది. చివరి సారిగా భారత్ 2011 వరల్డ్ కప్ ను గెలిచి.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కు బహుమతిగా ఇచ్చి.. ఘనంగా వీడ్కోలు పలికింది. ఇక ఇప్పుడు ఈ పొట్టి వరల్డ్ కప్ ను గెలిచి.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం మన జట్టు ఉన్న ఫామ్ ను చూస్తే ఇది పెద్ద విషయం కాదు. కానీ సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియాలో కొత్త టెన్షన్ మెుదలైంది. దాంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు.

13 ఏళ్ల వరల్డ్ కప్ కలను నెరవేర్చుకోవాలని టీమిండియా ఆరాటపడుతుంటే.. మరోవైపు తొలి ప్రపంచ కప్ ను ముద్దాడాలని దక్షిణాఫ్రికా ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ సమవుజ్జీల సమరం కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మెగాటోర్నీలో భారత్ సమష్టి ప్రదర్శనతో అదరగొడుతోంది. దాంతో ఈసారి వరల్డ్ కప్ మనదే అని అభిమానులు నిశ్చయంగా చెబుతున్నారు. సఫారీ టీమ్ సైతం గొప్పగా ఆడుతున్నప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం టీమిండియాదే కప్ అని ఫిక్స్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఐసీసీ ప్రకటనతో ఒక్కసారిగా జట్టులో కొత్త టెన్షన్ మెుదలైంది. అదేంటంటే?

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ అంపైర్ల జాబితాను ప్రకటించింది. ఇదే ఇప్పుడు టీమిండియాను, ఫ్యాన్స్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మ్యాచ్ కు ఆన్ ఫీల్డ్ అంపైర్లు గా న్యూజిలాండ్ కు చెందిన క్రిస్ గాఫ్నీ, ఇంగ్లండ్ నుంచి రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ లు వ్యవహరించనున్నారు. ఇక థర్డ్ అంపైర్ గా భారత్ కు చిరకాలంగా విలన్ గా ఉంటూ వస్తున్న రిచర్డ్ కెటిల్ బరో ఉండటంతో టెన్షన్ మెుదలైంది. ఫోర్త్ అంపైర్ గా రోడ్ టక్కర్ తన బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. కాగా.. గత నాలుగేళ్లలో ఐరన్ లెగ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్ బరో, ఇల్లింగ్ వర్త్ లు భారత్ ఆడిన నాలుగు ఐసీసీ నాకౌట్ మ్యాచ్ ల్లో అంపైర్లుగా వ్యవహరించారు. ఆ నాలుగు మ్యాచ్ ల్లో టీమిండియా ఓడిపోయింది.

2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఇల్లింగ్ వర్త్-కెటిల్ బరో ఆన్ ఫీల్డ్ అంపైర్లు గా వ్యవహరించారు. ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఇక 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇల్లింగ్ వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్ గా ఉండగా.. కెటిల్ బరో టీవీ అంపైర్ గా వ్యవహిరించాడు. ఈ మ్యాచ్ లోనూ టీమిండియా ఓడిపోయింది. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఇదే రిపీట్ అయ్యింది. చివరిగా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో వీరిద్దరు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా వీరు అంపైర్ల జాబితాలో ఉండటంతో.. ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మెుదలైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి