iDreamPost

DSC పరీక్షల షెడ్యూల్ విడుదల.. పరీక్షా తేదీలు ఇవే

TS DSC 2024 Exam Schedule: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణలో తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ జూన్ 28న ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి.

TS DSC 2024 Exam Schedule: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణలో తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ జూన్ 28న ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి.

DSC పరీక్షల షెడ్యూల్ విడుదల.. పరీక్షా తేదీలు ఇవే

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. ఇప్పటికే గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేపట్టగా గ్రూప్ 2,3, డిఎస్సీ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఏ పరీక్ష ఏ తేదీల్లో జరుగనున్నదంటే?

టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ జూన్ 28న ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి. మొట్టమొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించనున్నారు. రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి. కాగా డీఎస్సీ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 20తో ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 2,79,956 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక టీచర్ అభ్యర్థులు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

టీఎస్‌ డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలు:

  • జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
  • జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  • జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
  • జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
  • జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష
  • జులై 24న స్కూల్ అసిస్టెంట్ – బయలాజికల్ సైన్స్ పరీక్ష
  • జులై 25న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ పరీక్షలు
  • జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  • జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష.
  • ఆగస్టు 5 వరకు మిగతా పరీక్షలను నిర్వహించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి