iDreamPost
Live Now

తెలంగాణలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు.. లీడ్‌లో ఎవరున్నారంటే..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. నేతల్లో ఉత్కంఠ కొనసాగుతుంది.. ఫలితాలపై అన్ని పార్టీలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఓటర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. నేతల్లో ఉత్కంఠ కొనసాగుతుంది.. ఫలితాలపై అన్ని పార్టీలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఓటర్

తెలంగాణలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు.. లీడ్‌లో ఎవరున్నారంటే..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందడి మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 48 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కేంద్రాలు చేరుకున్నాయి.. ఇందులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఈసారి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి. ఇందుకోసం 131 టేబుళ్లను ఏర్పాటు చేసి లెక్కింపు ప్రక్రియ మొదలు పెట్టారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. 9.30 నుంచి 10 గంటల మధ్య మొదటి రౌంట్ ఫలితాలు బయటకు వస్తాయా. తర్వాత 20 నిమిషాలకు ఒక రౌండ్ రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాలు వస్తున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు షురు అయ్యింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద నేతలు, కార్యకర్తలతో కోలాహలంగా ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఫలితాల విషయానికి వస్తే.. హూరా హూరీగానే నడుస్తుంది. మధిరలో భట్టి విక్రమార్క ముందంజలో ఉండగా.. కామారెడ్డిలో బీజేపీ ముందజలో ఉంది. చంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఓవైసీ ముందంజలో ఉండగా.. ఖమ్మంలో తుమ్మల ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 15 చోట్ల ఆదిక్యత ప్రదర్శిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా నడుస్తున్నట్లు కనిపిస్తుంది. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనీల్ కుమార్ రెడ్డి, నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 4000 వేల ఓట్ల ఆదిక్యంలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ 12 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ముందంజల్లో ఉన్నారు. ములుగు లో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క., పాలేరులో పొంగులేటి ముందంజలో ఉన్నారు. బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాజ్ గోపాల్ రెడ్డి, ధర్మపురి, మంథనిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. సిరిసిల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్, వేముల వాడలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కొండగల్ లో రేవంత్ రెడ్డి, హుజూరాబాద్ లో ఈటెల, పగిరి, వికారాబాద్, తాండూర్ లో ప్రస్తుతం కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతుంది. మధిర, అశ్వరావుపేట, నాగార్జునసాగర్, మిర్యాలగూడ,ఆలేరు రెండు రౌండ్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కొల్లపూర్ లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న బర్రెలక్క శిరీష మొదట ముందంజలో ఉన్నప్పటికీ.. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు 1300 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు.

LIVE NEWS & UPDATES

  • 03 Dec 2023 10:19 AM (IST)

    కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్.. కామారెడ్డిలో రేవంత్ ముందంజ..!

    ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెంట్ కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యత ప్రదర్శిస్తుందని వార్తలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెంట్ కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. మరోవైపు తెలంగాణలో మూడు పార్టీలు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీగికి దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెంట్ కౌంటింగ్ రిజల్ట్ హూరా హూరీగా సాగుతుంది. వివరాల్లోకి వెళితే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి