iDreamPost

రాత్రిపూట యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారా? ఐతే మీకు గుడ్ న్యూస్..

Good News To YouTube Users: రాత్రి సమయంలో యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నారా? ఐతే మీకు గుడ్ న్యూస్. రాత్రి పూట వీడియోలు చూసేవారి కోసం యూట్యూబ్ సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఇది డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. ఈ ఫీచర్ వస్తే కనుక యూజర్లకి రెండు భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆ ఫీచర్ ఏంటంటే?

Good News To YouTube Users: రాత్రి సమయంలో యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నారా? ఐతే మీకు గుడ్ న్యూస్. రాత్రి పూట వీడియోలు చూసేవారి కోసం యూట్యూబ్ సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఇది డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. ఈ ఫీచర్ వస్తే కనుక యూజర్లకి రెండు భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆ ఫీచర్ ఏంటంటే?

రాత్రిపూట యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారా? ఐతే మీకు గుడ్ న్యూస్..

యూట్యూబ్ ద్వారా చాలా మంది లక్షలు సంపాదించుకుంటున్నారు. లాంగ్ వీడియోలు, షార్ట్ వీడియోలు పెడుతూ ప్రతి నెలా ఆదాయం పొందుతున్నారు. కామెడీ వీడియోలు, వ్లాగ్స్, కుకింగ్ వీడియోలు పెడుతూ మంచిగా సంపాదించుకుంటున్నారు. కాగా ఈ యాప్ ని వాడేవారికి గుడ్ న్యూస్ చెప్పింది యూట్యూబ్. అది కూడా రాత్రి సమయంలో యూట్యూబ్ యాప్ ని వాడేవారికి మాత్రమే. రాత్రి సమయంలో యూట్యూబ్ వీడియోలు చూడడం చాలా మందికి అలవాటు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసి వచ్చి నిద్రపోయే ముందు కాస్త తీరిక దొరుకుతుంది. ఈ సమయంలో చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి రెండు ప్రయోజనాలు చేకూర్చేలా యూట్యూబ్ సరికొత్త ఫీచర్ ని లాంఛ్ చేయబోతుంది. ఆ ఫీచర్ ఏంటంటే?  

యూట్యూబ్ యూజర్లు త్వరలోనే ఒక కొత్త ఫీచర్ ను చూడబోతున్నారు. వీడియోలు చూస్తూ నిద్రలోకి జారుకునే యూజర్స్ కి ఈ ఫీచర్ ఒక పరిష్కారంగా మారనుంది. యూట్యూబ్ యాప్ కొత్తగా ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం స్లీప్ టైమర్ ఫీచర్ ని తీసుకొస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ లో కంటిన్యూగా వీడియోలు చూసినంత సేపు ప్లే అవుతూనే ఉంటాయి. నిద్రలోకి జారుకున్నాక ఆటోమేటిక్ గా వీడియోలు ఆగే అవకాశం లేదు. దీని వల్ల డేటా అనేది లాస్ అవుతారు. అలానే ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. నిద్ర మధ్యలో లేచి వీడియోలు ఆపే వరకూ ప్లే అవుతూనే ఉంటాయి. మ్యాన్యువల్ గా ఆపితే తప్ప ఆగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్ గా ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకి వీడియోలు ఆగిపోయేలా యూట్యూబ్ కొత్త ఫీచర్ ని తీసుకురాబోతుంది. ఇది నిజంగా నిద్రపోయే ముందు యూట్యూబ్ వీడియోలు చూసే వారికి ఉపయోగపడే ఫీచర్. పలు నివేదికల ప్రకారం.. ఈ స్లీప్ టైమర్ ఫీచర్ డెవలప్మెంట్ లో ఉంది. 

ఇది ఎలా పని చేస్తుందంటే?:

త్వరలో రాబోతున్న స్లీప్ టైమర్ ఫీచర్ అంది ఆండ్రాయిడ్ యూజర్స్ కి నిద్రపోయే ముందు వీడియోలు ఎంత సేపు చూడాలో.. ఎంత సేపటి తర్వాత వీడియోలు ప్లే అవ్వడం ఆగిపోవాలో అనేది ఒక టైంని సెట్ చేసుకోవచ్చు. ఒకసారి టైమర్ ని సెట్ చేసుకుంటే.. ఆ టైం రీచ్ అయ్యాక ఆటోమేటిక్ గా వీడియో ప్లే అవ్వడం ఆగిపోతుంది. ఒకవేళ ఆ సమయానికి మీరు లేచి ఉంటే టైమర్ ని మరింత సమయం పొడిగించుకోవడమో లేక రీసెట్ చేసుకోవడమో చేసుకోవాలి. అయితే ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఖచ్చితంగా ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు అనేది టైమర్ లో పేర్కొనలేరు. వీడియోలు చూడడానికి ఇంకా ఎంత సమయం ఉంది అనేది మాత్రం నోటిఫికేషన్ లో చూపిస్తుంది. మొత్తానికి రాత్రి నిద్రపోయే ముందు వీడియోలు చూసే యూజర్లకి యూట్యూబ్ కొత్త ఫీచర్ నైతే తీసుకొస్తుండడం మంచి విషయమనే చెప్పాలి. దీని వల్ల ఫోన్ ఛార్జింగ్, డేటా రెండూ సేవ్ అవుతాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి