ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏప్రిల్ మొదటి వారంలో పరిషత్ ఎన్నికలు జరగ్గా.. సుప్రిం కోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికల కోడ్ అమలు చేయలేదంటూ టీడీపీ, జనసేన పార్టీలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, పోలింగ్‌కు ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ నిర్వహణకు అనుమతించిన హైకోర్టు.. తుది తీర్పు వెలువడే వరకూ ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత […]
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆగిన చోట నుంచే మళ్లీ త్వరలోనే మొదలవుతాయనే ప్రచారం జరుగుతున్న వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సంచలన నిర్ణయం తీసుకుంది. పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అరాచకాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ పేర్కొంటోంది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పుడే రెచ్చిపోయిన వైసీపీ.. ఇప్పుడు ఆయన లేకుండా పరిషత్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరవనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొస్తోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ […]
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ కొలిక్కి రానుందా..? నూతన ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిషత్ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కాబోతోందా..? అంటే సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. ‘‘కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు మళ్లీ ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇందుకు పరిష్కారం కోవిడ్ వ్యాక్సిన్ వేయడమే. ఆరు రోజుల్లో ముగిసే పరిషత్ ఎన్నికల ప్రక్రియ తర్వాత వ్యాక్సినేషన్ కార్యక్రమంపై దృష్టి అంతా […]
ఎడ్డమంటే తెడ్డమనేలా రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై పూర్తిగా చేతులు ఎత్తేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది జరగకూడదనేలా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇప్పటి వరకు వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. పదవీ విరమణ చేస్తున్న చివరి దశలోనూ అదే తీరును కనబరుస్తున్నారు. మధ్యలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేస్తే పరిపాలనా పరంగా ఇబ్బందులు ఉండవని, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని […]
వాయిదా పడిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఈ నెలలో జరగవని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తేలిపోయింది. పరిషత్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని హైకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వం, ఎస్ఈసీ కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేయడంతో పరిషత్ ఎన్నికలు ఈ ఆర్థిక ఏడాదిలో జరగవని నిర్థారణ అయింది. ఈ నెల 30వ తేదీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీ […]
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసి గత శనివారం తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు.. ఈ రోజు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. ఆగిన చోట నుంచే ఎన్నికలు జరగడం ఖాయమైన నేపథ్యంలో.. పరిషత్ ఎన్నికలు ఈ నెలాఖరులోపు జరుగుతాయా..? లేదా..? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. గత ఏడాది మార్చిలో పరిషత్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అభ్యర్థుల […]
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బెదిరింపులు, దౌర్జన్యాలు వల్ల నామినేషన్లు దాఖలు చేయలేదని, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారనే భావనతో.. ఆయా స్థానాల్లో మళ్లీ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్వో ధృవీకరిస్తూ ఫాం–10 జారీ చేసిన తర్వాత.. విచారణ జరిపే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది గత విచారణలో […]
గత ఏడాది మార్చిలో వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు కాబోతున్నాయా..? మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ కాబోతోందా..? అనే అనుమానాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చేసిన ప్రకటన, తీసుకున్న నిర్ణయం బలపరుస్తున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నామినేషన్లు ఉపసంహరణ వరకు కొనసాగాయి. ఆ తర్వాత కరోనాను కారణంగా చూపుతూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వాయిదా వేశారు. దాదాపు 20 శాతానికి పైగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఒకే నామినేషన్ దాఖలు కావడంతో అవి […]
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ సర్పంచ్‌లకు ఎన్నికల నిర్వహణపై గురువారం ఒక స్పష్టత రానునట్టు తెలుస్తుంది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే విధిస్తూ ఈ విషయాన్ని రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్ట్ సూచించింది. ఈ నేపథ్యంలో […]