ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అదే స్థాయిలో పవన్ పై కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాలను టైమ్ పాస్ కోసం చేస్తున్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం పవన్ పై కీలక వ్యాఖ్యలు […]
సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని టీటీడీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలోని జనసేన, బిజెపిల నుంచి వైఎస్సార్ సిపిలోకి చేరిన కార్యకర్తలను మద్దిలపాలెం, పార్టీ కార్యాలయంలో కండువాలు వేసి ఆహ్వానించారు. ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి మేలు చేకూర్చేలా పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. ప్రతి ఇంటికి ఆసరా ఇచ్చేలా చేపడుతున్న సంక్షేమానికి […]
The Tirumala Tirupati Devasthanams ,TTD టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి గారి అధ్యక్షతన బుధవారం తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బోర్డు తీసుకున్న ప్రధాన నిర్ణయాలు ఇలా ఉన్నాయి. – హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో మొదటి విడతలో 502 ఆలయాలు నిర్మించాం. రెండో విడతలో శ్రీవాణి ట్రస్టు నిధులతో దశలవారీగా ఆలయాల నిర్మాణం చేపడతాం. ఈ ఆలయాలను త్వరితగతిన […]
బట్ట కాల్చి మొహం మీద పడేయడమనే నానుడి మాదిరిగా ఏపీలో ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేస్తోందనే విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగితే దాని పూర్వా పరాలు తెలుసుకోకుండా.. వెంటనే ప్రభుత్వాన్ని నిందించడం, అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం సర్వసాధారణంగా జరుగుతోంది. సదరు ఘటనలు జరిగిన సమయంలో ఆరోపణలు, విమర్శలతో హడావుడి చేస్తున్న ప్రతిపక్ష టీడీపీ.. ఆ తర్వాత జరిగే పరిణామాలపై మాత్రం మౌనం పాటిస్తోంది. ఇటీవల జరిగిన పలు ఘటనలను […]
తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై టీడీపీ,బీజేపీ నేతల విషప్రచారాలకు, వాస్తవానికి పొంతన లేదని కేంద్రమంత్రి పరోక్షంగా తేల్చేశారు. తాజాగా బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలు దానికి నిదర్శనం. మోడీ మంత్రివర్గ సహచరుడే నేరుగా టీటీడీ పాలకమండలి ప్రయత్నాలను అభినందించిన తీరు ఆసక్తికరం. కొద్దిరోజుల క్రితం బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. తిరుమల వేదికగా మతరాజకీయాలు విపక్షాల సృష్టి అని ఆయన మండిపడ్డారు. […]
ప్రపంచం నలుమూలలా ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. స్వామి వారిని ఏడాదిలో ఒకసారైనా దర్శించుకోవాలని ప్రతి భక్తుడు ఆశిస్తాడు. దేశ విదేశాల్లో ఉన్న స్వామి వారి భక్తులకు ఆ అవకాశం లభించకపోయినా శ్రీవారి నిత్య కైంకర్యాలు, ఇతర కార్యక్రమాలు అన్నీ నిత్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్‌వీబీసీ) ద్వారా వీక్షిస్తూ తన్మయత్వం పొందుతున్నారు. ప్రస్తుతం ఎస్‌వీబీసీ ఛానెల్‌లో స్వామి వారి కైంకర్యాలు, కళ్యాణం, బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలన్నీ […]
ఎట్టకేలకు సప్తగిరి మాస పత్రికలో ప్రచురితమైన వ్యాసం పైన చెలరగిన వివాదం సద్దుమణిగింది. రామాయణంలో సీతకు లవుడు మాత్రమే కుమారుడని, కుశుడు దర్బతో రాసిన బొమ్మ అంటూ ప్రచురితమైన వ్యాసంతో కొందరు భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన టి.టి.డి అధికారులు ఈ వ్యవహారం పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని కోరగా , రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు సప్తగిరి పత్రిక ఎడిటర్ రాధా రమణ, సబ్ ఎడిటర్‌లను విచారించారు. […]
కరోనా వైరస్ వల్ల రెండు నెలలకు పైగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కోల్పోయిన భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రార్థనామందిరాలు తెరవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజు నుంచి శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 8,9 తేదీత్లో కొండపై ఉన్న టీటీడీ ఉద్యోగులకు, 10వ తేదీలో స్థానికులకు, 11వ తేదీ […]
తమకు ఇష్టం లేని వాళ్లు ఎలాంటి మంచి పనులు చేసినా కొందరికి కనిపించవు. వినిపించవు. పైగా విపరీతమైన రాజకీయ కడుపు మంటతో బాధపడుతూ.. ఆ అసహనాన్ని ఇతరులపై నిందలు వేయడం ద్వారా తగ్గించుకోవడానికి చూస్తారు. అలాంటి కోవలోకే చెందుతారు టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్‌ను వాడు వీడు అంటూ చులకనతో మాట్లాడడంతోపాటు లేనిపోని అభాండాలు వేస్తూ వచ్చారు. ఒకానొక సందర్భంలో జేసీ […]
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విషయంలో మరింత పారదర్శకంగా ఉండేందుకు వీలుగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు భక్తులు ఇచ్చిన ఆస్తుల్లో నిరర్ధకరమైన వాటిని విక్రయించే విధానంపై శాశ్వత నిషేధం విధిస్తూ తీర్మానించింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీటీడీకి చెందిన 50 నిరర్ధక ఆస్తులను అమ్మేందుకు అప్పటి బోర్డు తీసుకున్న నిర్ణయంపై ఇటీవల సమీక్ష చేసిన సందర్భంగా అదే తెలుగుదేశం, బీజేపీ నేతలు వివాదాస్పదం చేసిన విషయం తెలిసిందే. దీనికి పరిష్కారంగా టీటీడీకి […]