ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవునితో చెలగాటమాడే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోందన్నారు. దేవుడు అంటే భక్తి, భయం లేకుండాపోయిన పరిస్థితి నేడు కనిపిస్తోందన్న సీఎం వైఎస్ జగన్.. దాడులు చేసే వారుఎవరైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రైవేటు, ప్రతిపక్ష నేతల పర్యవేక్షణలో ఉన్న ఆలయాలపైనే దాడులు జరుగుతున్నాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆలయాలను కూడా వదిలపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర పోలీస్ […]