రామతీర్థం కొండపై జరిగిన దుశ్చర్యకు చంద్రబాబు, లోకేష్, అశోక్‌గజపతిరాజే కారణమని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. లోకేష్ విసిరిన సవాల్‌కు సిద్ధమన్న ఆయన.. తేదీ, సమయం చెప్తే సింహాద్రి అప్పన్న సన్నిధికి వస్తామని తెలిపారు. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని, విజయవాడలో ఆలయాలను తొలగించిన దుర్మార్గుడు చంద్రబాబు […]