ఆర్ఆర్ఆర్ విడుదల ప్లాన్ చేసుకున్న రెండు తేదీల్లో ఒకటి ఏప్రిల్ 28. ఆల్రెడీ దీన్ని ఎఫ్3 లాక్ చేసుకున్నప్పటికీ ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు కాబట్టి ఇప్పటికిప్పుడు ఖరారుగా ఏమీ చెప్పలేం. అయితే ఈ డేట్ కి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. అదేంటో చూద్దాం. తెలుగు మాస్ సినిమాకు కొత్త గ్రామర్ నేర్పించిన ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ 1977లో రిలీజయింది ఈ డేట్ కే. ఏడాది పాటు ఆడేసి కోట్ల రూపాయల కనకవర్షాన్ని థియేటర్ల […]
కొన్ని డేట్లను సినిమా పరిశ్రమలో మేజిక్ గా భావిస్తారు. అదేంటో ఆ రోజు విడుదలైన చిత్రాలు భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాక చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి. అంతే కాదు వాటి హీరో హీరోయిన్లకు దర్శకులకు కెరీర్ పరంగానూ ఎంతో డిమాండ్ ని సృష్టించిపెడతాయి. అలాంటిదే ఏప్రిల్ 28. ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారా. 1977లో సరిగ్గా ఇదే రోజున ఎన్టీఆర్ అడవిరాముడు రిలీజై వసూళ్ల ప్రభంజనం అంటే ఏంటో నిరూపించింది. అప్పటివరకు ఏ తెలుగు […]
అప్పుడెప్పుడో ఎన్టీఆర్ దేవాంతకుడుతో మొదలుపెడితే విజయంసాధించిన తెలుగు సినిమాల చరిత్రలో యముడి పాత్రకు చాలా ప్రత్యేకత, విశిష్టత ఉంది. అది దశాబ్దాల పాటు కొనసాగింది. ఎందరో హీరోలు ముచ్చటపడి మరీ యముడి బ్యాక్ డ్రాప్ తో కథలు చేసి అద్భుతమైన సక్సెస్ లు అందుకున్నారు. యమగోల అప్పట్లోనే ఒక చరిత్ర సృష్టించింది. జనం తండోపతండాలుగా ఎగబడి మరీ యముడి వినోదాన్ని మనసారా ఆస్వాదించారు. ఆ తర్వాత కొంత కాలానికి చిరంజీవి యముడికి మొగుడు బాక్స్ ఆఫీస్ రికార్డులు […]