ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేక శైలి. ఆయన ఇప్పటివరకూ ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు బరిలో దిగిన దాఖలాలు లేవు. 2014,19కి వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే టికెట్ పై పోటీ చేసిన చరిత్ర కూడా లేదు. అలాంటి నాయకుడికి వచ్చే ఎన్నికల గురించి బెంగ పట్టుకుంది. మరోసారి విజయం సాధించేందుకు ఢోకా లేకుండా చేసుకోవాలని ఆయన తహతహలాడుతున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేసినా తనకు ధీమా ఉండాలని ఆశిస్తున్నారు. అందుకే ప్రస్తుతం […]
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మొత్తబడ్డారు. టీడీపీ అధినేత బుజ్జగింపులతో దారికొచ్చినట్టే కనిపిస్తోంది. సుమారు రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ టీడీపీ సమావేశానికి పూనుకున్నారు. పార్టీ నిర్మాణానికి సంబంధించి క్యాడర్ తో సమావేశమయ్యి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాంతో కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న గంటా శ్రీనివాసరావు హఠాత్తుగా పునర్ధర్శనం విశేషంగా మారుతోంది. వాస్తవానికి గంటా శ్రీనివాసరావు మరోసారి పార్టీ ఫిరాయిస్తున్నారనే ప్రచారం చాలాకాలంగా. ఆయన ప్రయత్నాలు ఆ రీతిలో సాగాయి. నేరుగా బీజేపీ […]