మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మొత్తబడ్డారు. టీడీపీ అధినేత బుజ్జగింపులతో దారికొచ్చినట్టే కనిపిస్తోంది. సుమారు రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ టీడీపీ సమావేశానికి పూనుకున్నారు. పార్టీ నిర్మాణానికి సంబంధించి క్యాడర్ తో సమావేశమయ్యి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాంతో కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న గంటా శ్రీనివాసరావు హఠాత్తుగా పునర్ధర్శనం విశేషంగా మారుతోంది. వాస్తవానికి గంటా శ్రీనివాసరావు మరోసారి పార్టీ ఫిరాయిస్తున్నారనే ప్రచారం చాలాకాలంగా. ఆయన ప్రయత్నాలు ఆ రీతిలో సాగాయి. నేరుగా బీజేపీ […]
తెలుగుదేశం పార్టీని కుదిపేసేలా మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో చిక్కుకుని విలవిలలాడుతున్న నేతలకు తోడు మరి కొందరికి కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని జగన్ ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక […]
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి అక్కడ ఏమి జరిగినా.. సంచలనమే అవుతోంది. వార్తలో పతాక శీర్షికల్లో నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. రాజకీయ పార్టీలు అత్యంత వేగంగా స్పందిస్తున్నాయి. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న విశాఖలో మరో నెల రోజుల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. టీడీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణంపై వేసిన సిట్.. తన దర్యాప్తును మరో నెల రోజుల్లో పూర్తి చేయనుంది. నవంబర్ నెలాఖరుకు దర్యాప్తు […]