సినిమాల్లో ట్రిపుల్ రోల్ చాలా అరుదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ, అప్పుడెప్పుడో చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు, అంతకుముందు అన్న ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ లాంటివి తప్ప మరీ గుర్తుంచుకోదగ్గవి చాలా తక్కువ. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోనూ అలాంటి చెప్పుకోదగ్గ చిత్రం ఒకటుంది. ఆ ముచ్చట్లు చూద్దాం. 1969 తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా ‘దైవ మగన్’ వచ్చింది. ఏసి త్రిలోకచందర్ దర్శకులు. కమర్షియల్ గానూ ఈ మూవీ గొప్ప విజయం అందుకుంది. […]
టాలీవుడ్ చరిత్రలో అత్యంత ప్రయోగాలు, విభిన్నమైన చిత్రాలు చేసిన తొలినాటి హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. 70 ఎంఎంలో తీసినా, కౌ బాయ్ కల్చర్ ని తెలుగువాళ్ళకు పరిచయం చేసినా, ముప్పై ఏళ్ళ క్రితమే బాహుబలి రేంజ్ గ్రాండియర్ ని చూపించినా, ఇంగ్లీష్ వాళ్లకు తప్ప మనకు అంతగా వంటబట్టని జేమ్స్ బంద్ సంస్కృతిని ఇక్కడికి తీసుకొచ్చినా ఆయనకే చెల్లింది. తన భావజాలాన్ని చూపించేందుకు కృష్ణ ఎన్నడూ వెనుకాడేవారు కాదు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించి […]
అప్పుడెప్పుడో 1974లో వచ్చిన కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు సినిమా చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేని ఆణిముత్యం. మన్నెం వీరుడిగా ఆయన్ను మురిపించే స్థాయిలో ఇంకెవరూ మెప్పించలేకపోయారు. కనీసం ఆ పాత్రను ట్రై చేద్దామని ఎన్టీఆర్ లాంటి దిగ్గజాలు సైతం ఆలోచించలేదు. అంతటి ప్రభావం చూపించిన మాస్టర్ పీస్ అది. అందులో రామరాజు ప్రియురాలిగా సీత పాత్రలో నటించిన విజయనిర్మల ఇష్టం లేని పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసుకునే సీన్ గొప్పగా పండింది. ఇప్పుడు దీనికి ఆర్ఆర్ఆర్ కి […]
సాధారణంగా హీరోలు దర్శకులు కావడం చూసాం. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు చరిత్రలో నిలిచిపోయే దానవీర శూరకర్ణ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలు నభూతో నభవిష్యత్ అనే రీతిలో రూపొందించారు. నటశేఖర్ కృష్ణ సింహాసనం లాంటి హై బడ్జెట్ మూవీని కొడుకు దిద్దిన కాపురం లాంటి కమర్షియల్ హిట్స్ ని అందించడం సినిమా ప్రేమికులెవరూ మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ సైతం జానీతో ఈ ఫీట్ చేశాడు కాని అది ఫెయిలయ్యింది. ఒకవేళ జాని హిట్ అయ్యుంటే […]
https://youtu.be/