iDreamPost
android-app
ios-app

నానమ్మ ఆస్తి.. తండ్రితో ఆస్తి గొడవల వార్తలపై నరేశ్ కుమారుడు క్లారిటీ!

  • Published Aug 30, 2023 | 2:09 PM Updated Updated Aug 30, 2023 | 2:09 PM
  • Published Aug 30, 2023 | 2:09 PMUpdated Aug 30, 2023 | 2:09 PM
నానమ్మ ఆస్తి.. తండ్రితో ఆస్తి గొడవల వార్తలపై నరేశ్ కుమారుడు క్లారిటీ!

లెజెండరీ హీరోయిన్, డైరెక్టర్, నిర్మాత విజయనిర్మల గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయాలు అక్కర్లేదు. తెలుగు సినిమాలో ఆమె చేసిన ప్రయోగాలు, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు గురించి అందరికీ తెలిసిందే. ఆమె కుమారుడు నరేశ్ కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడు. హీరోగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఇప్పుడు బెస్ట్ ఫాదర్ రోల్స్ లో నవ్వులు పూయిస్తున్నారు. ఆయన కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ కూడా వెండితెరపై నటుడిగా స్థిర పడాలని భావించాడు. అందుకు ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ, తర్వాత ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నారు.

ఇటీవల నరేశ్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ పంద్రాగస్టు సందర్భంగా సాయి ధరమ్ తేజ్- కలర్స్ స్వాతి జంటగా సోల్ ఆఫ్ సత్య అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఈ షార్ట్ ఫిల్మ్ కు నవీన్ విజయ కృష్ణ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఈ ఫిల్మ్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. నవీన్ డైరెక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సాంగ్ రిలీజ్ తర్వాత నవీన్ విజయ్ కృష్ణ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. అలాగే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నవీన్ తన వ్యక్తిగత జీవితం, నానమ్మతో అనుబంధం, నానమ్మ ఆస్తులు, నాన్నతో ఆస్తివివాదాలంటూ వచ్చే వార్తలు అన్నింటిపై స్పందించాడు. అలాంటి అన్ని టాపిక్స్ పై చాలా క్లియర్ గా సమాధానం చెప్పాడు.

“నేను ఎప్పుడూ ఆస్తుల గురించి ఆలోచించేవాడిని కాదు. నాకు ఆస్తుల గురించి ఎలాంటి అవగాహన కూడా లేదు. ఓసారి నానమ్మ తన ఆస్తుల గురించి నాన్నతో మాట్లాడారు. తన ఆస్తిలో సగం నా పేరు మీద రాస్తానని నాన్నకు చెప్పారు. అందుకు సంబంధించి వీలునామా కూడా రాసిస్తానని చెప్పారు. మిగిలిన సగం నాన్న పేరుమీద రాస్తానని చెప్పారు. ఆస్తుల విషయంలో నాన్నా- నేను ఒక అండర్ స్టాడింగ్ కు వచ్చాం. ఆ తర్వాత నానమ్మ తన ఆస్తి మొత్తాన్ని నాన్నకే రాశారు. ఇప్పుడు ఆస్తి మొత్తం నాన్న పేరు మీదే ఉంది. తన తర్వాత ఆ ఆస్తి ఎలాగు నాకే కదా వచ్చేది అని మాట్లాడుతూ ఉంటారు. నేను అసలు ఆస్తుల గురించి ఎప్పుడూ పట్టించుకోను. ఆ ఆస్తి మొత్తం నానమ్మ కష్టార్జితం అందులో మేము సంపాదించింది ఏమీ లేదు. ఆ ఆస్తికి నాన్న గార్డియన్ గా ఉన్నారు. నాన్న తర్వాత ఆ బాధ్యత నేను తీసుకుంటాను. నాన్నకు నాకు మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలు, మనస్పర్ధలు లేవు. నేను నాన్న సంరక్షణలో ఉండటానికే ఇష్టపడతాను. నా తమ్ముళ్లు రణవీర్, తేజ ఇద్దరూ ఇష్టమే. తేజ అంటే నాకు ప్రాణం” అంటూ నవీన్ విజయ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ