ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన వాగ్వాదంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ద్రవ్య వినిమయ బిల్లు మొదట ప్రవేశపెట్టాలని టీడీపీ, సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు ప్రవేశపెట్టాలని అధికార వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో రోజంతా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ సభ్యుల మధ్య ఉదయం మొదలైన వాదోపవాదాలు సమయం గడిచే కొద్దీ పెరిగాయి. సభ్యులు ఒకరినొకరు దూషించకోవడం, తోసుకోవడం వరకూ పరిస్థితులు వెళ్లాయి. […]