విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో వెలగపూడి రామకృష్ణబాబు ఒకరు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన తన నియోజకవర్గంలో ఉండడం లేదు. ఒకటి రెండు సార్లు పార్టీ కార్యాలయంలో కనిపించినప్పటికీ పూర్తిస్థాయిలో అమరావతికే పరిమితమయ్యారు. ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండడానికి కారణమేంటా అని ఆరా తీయగా.. సొంత పార్టీ కార్యకర్తలే అని తెలిసిందే. వైజాగ్‌లోని మిగతా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు, వాసుపల్లి గణేశ్ […]