విజయవాడ లో ఘోరం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. దీనిపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఘోరానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసింది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం పేరుతో ఆమెను నమ్మించి ఆస్పత్రిలో ఉంచి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై […]