iDreamPost
android-app
ios-app

మెగా ‘ఉప్పెన’లో చామంతి ఛాయలు

  • Published Mar 05, 2020 | 6:16 AM Updated Updated Mar 05, 2020 | 6:16 AM
మెగా ‘ఉప్పెన’లో చామంతి ఛాయలు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఉప్పెన వచ్చే నెల విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన ఫస్ట్ ఆడియో సింగల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. దేవిశ్రీప్రసాద్ తన ఒరిజినల్ స్టైల్ లో చాలా రోజుల తర్వాత కంపోజ్ చేశాడని ఫీడ్ బ్యాక్ వచ్చింది. సుకుమార్ రాతలో అతని శిష్యుడు బుచ్చిబాబు డెబ్యూగా వస్తున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా నటించడంతో ఆసక్తి పెరుగుతోంది. అయితే దీనికి చాలా ఏళ్ళ క్రితం వచ్చిన చామంతి అనే సినిమాకు దగ్గరి పోలికలున్నాయనే టాక్ ఇప్పుడు ఫిలిం నగర్ లో మొదలైంది.

1992లో ప్రశాంత్ హీరోగా చామంతి వచ్చింది. రోజా హీరోయిన్. ఆర్కె సెల్వమణి దర్శకుడు. దీని షూటింగ్ సమయంలో రోజా సెల్వమణిల మధ్య ప్రేమ చిగురించి ఆ తర్వాత పెళ్లిదాకా వెళ్లి ఇద్దరూ దంపతులయ్యారు. ఇదలా ఉంచితే చామంతి ఓ డబ్బున్న అమ్మాయికి, జాలరి కులానికి చెందిన అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ. బ్యాక్ డ్రాప్ మొత్తం సముద్రం, దాని మీద ఆధారపడే జాలర్ల కుటుంబాల మీదే సాగుతుంది. రోజా అన్నయ్యగా రాధారవి పెర్ఫార్మన్స్ కు అవార్డులు కూడా దక్కాయి. ఇందులో విలన్ గా నాజర్ నటించగా క్లైమాక్స్ ని సముద్రంలో షూట్ చేశారు

ఇప్పుడు ఉప్పెన విషయానికి వస్తే చామంతికి రివర్స్ లో హీరో జాలరి కాగా హీరోయిన్ ఉన్నత కుటుంబం నుంచి వచ్చి ఉంటుందట. ఆమె అన్నయ్యగా విజయ్ సేతుపతి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. కథ పరంగా వ్యత్యాసం ఉండొచ్చేమో కానీ మెయిన్ పాయింట్ లో మాత్రం పోలికలుంటాయని టాక్. ఇళయరాజా పాటలు సమకూర్చిన చామంతి అప్పట్లో మంచి మ్యూజికల్ హిట్. భానుమతి గారి పాత్ర కూడా బాగా హైలైట్ అయ్యింది. ఇప్పుడు ఉప్పెనలో హీరో హీరోయిన్లు వీళ్ళ మధ్య విజయ్ సేతుపతి పాత్ర ఇలా త్రి డైమెన్షన్ లో సాగుతుందని తెలిసింది. మొత్తానికి మెగా మేనల్లుడు ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్ నే ఎంచుకున్నాడు. మరి ప్రీ రిలీజ్ పరంగా బాగానే ఉన్న బజ్ ని ఇది ఎంతవరకు అందుకుంటుందో వేచి చూడాలి